వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్తగా బుట్టార
● ఎమ్మిగనూరు సమన్వయకర్తగా
రాజీవ్‌రెడ్డి
ఎమ్మిగనూరుటౌన్: వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్తగా మాజీ ఎంపీ బుట్టా రేణుకను నియమించారు. అలాగే ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్తగా మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడైన కడిమెట్ల రాజీవ్‌రెడ్డిని నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్రకార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు.
వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్తగా బుట్టార


