కృష్ణమ్మా.. చల్లగా చూడమ్మా!
శ్రీశైలంటెంపుల్: కార్తీక మాసోత్సవాల్లో భాగంగా రెండో శుక్రవారం సాయంత్రం కృష్ణమ్మ హారతి కార్యక్రమం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పాతాళగంగ వద్ద ప్రతిష్టించిన కృష్ణవేణి విగ్రహానికి శాస్త్రోక్తంగా పూజలు చేపట్టారు. ముందుగా లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు సంకల్పాన్ని పఠించారు. నదీమతల్లికి ఏకహారతి, నేత్రహారతి, బిల్వహారతి, నాగహారతి, పంచహారతి, సద్యోజాతాది పంచహారతి, కుంభహారతి, నక్షత్రహారతి, రథహారతి, కర్పూరహారతులిచ్చారు. శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, ఏఈవో వెంకటేశ్వరరావు, పర్యవేక్షకులు పాల్గొన్నారు.


