కర్నూలు జిల్లాలో ఇదీ పరిస్థితి..
మోంథా తుపాను ప్రభావంతో కర్నూలు జిల్లాలో దాదాపు 4వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. హొళగుంద, కోసిగి, మంత్రాలయం, ఆలూరు, చిప్పగిరి, మద్దికెర మండలాల్లోని 27 గ్రామాలపై తుపాను ప్రభావం ఉంది. వరి 1,500 ఎకరాలు, శనగ 2,500 ఎకరాల ప్రకారం దెబ్బతిన్నాయి. వరికి ఎకరాకు రూ.30 వేలు, శనగకు ఎకరాకు రూ.15 వేల ప్రకారం రూ.7.60 కోట్ల మేర పంట నష్టం వాటిల్లింది. తుపాను ప్రభావంతో ఓర్వకల్‌లో 57.8 మి.మీ, కర్నూలు రూరల్‌లో 37.6, కల్లూరులో 34.6, కర్నూలు అర్బన్‌లో 34.2, వెల్దుర్తిలో 23, గూడూరులో 14.8, క్రిష్ణగిరిలో 14.4 మి.మీ వర్షపాతం నమోదైంది.


