జీడీపీ నీటి విడుదల
గోనెగండ్ల: ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు గాజులదిన్నె ప్రాజెక్ట్‌కు వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో జీడీపీ నీటిని హంద్రీనదికి విడుదల చేశారు. ప్రస్తుతం 3.8 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. నాలుగో క్రస్ట్ గేటు ద్వారా 336 క్యూసెక్కుల నీరు హంద్రీ నదిలోకి విడుదలైంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి వెయ్యి క్యూసెక్కుల వరద నీరు జీడీపీలోకి వచ్చి చేరుతోంది. 3.7 టీఎంసీల నీటిని నిలువ ఉంచేందుకు చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. గాజులదిన్నె ప్రాజెక్టును మంగళవారం ఇరిగేషన్ ఈఈ పాండురంగయ్య, డీఈ సుబ్బారాయుడు పరిశీలించారు.


