గమ్మత్తు కనరా..!
ఊరూరా ఏటీఎం (ఎనీ టైం మద్యం) దుకాణాలు వెలిశాయి. చిరు దుకాణాలు బెల్ట్‌షాప్‌లుగా మారాయి. పరదాల చాటున మినీ బార్లను తలపిస్తున్నాయి. మందు కోసం పట్టణాలకు రావాల్సిన అవసరం లేదు. పక్క వీధిలో అడుగుపడితే చేతిలో సీసా ప్రత్యక్షమవుతోంది. అవసరమైతే అక్కడే సిట్టింగ్ వేసినా అడిగేవారు ఉండరు. అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండటంతో ఓ వైపు మద్యం దుకాణదారులు నిబంధనలు అతిక్రమించి మద్యం విక్రయిస్తుండగా మరో వైపు పల్లెల్లో బెల్ట్ షాపు దందా ఫుల్‌గా సాగుతోంది. మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాలు, దారుణాలు చోటు చేసుకుంటున్నా అధికారుల చర్యలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. – సాక్షినెట్‌వర్క్
ఈర్నపాడు గ్రామంలోని బెల్ట్ షాప్ వద్ద ఉన్న పర్మిట్ రూమ్‌లో వాడేసిన లిక్కర్ బాటిళ్లు
మహానందిలో కూల్ డ్రింక్స్ ట్రేలో క్వార్టర్ బాటిళ్లు పెట్టిన దృశ్యం
గమ్మత్తు కనరా..!
గమ్మత్తు కనరా..!


