పోలీసుల అప్రమత్తతతో తల్లీబిడ్డలు సురక్షితం
మంత్రాలయం: పోలీసుల అప్రమత్తతతో తల్లీ, బిడ్డలు సురక్షితంగా బయటపడ్డారు. ఎస్‌ఐ శివాంజల్ తెలిపిన వివరాలు.. బెంగళూరుకు చెందిన సౌమ్య శివానంద్ భర్తతో గొడవ పడి ఇద్దరు పిల్లలతో కలిసి రైలులో మంగళవారం తెల్లవారుజామున మంత్రాలయం చేరుకుంది. పిల్లలతో కలిసి తుంగభద్ర నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకుంది. బెంగళూరులోని బిడిది పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ద్వారా విషయం తెలుసుకున్న మంత్రాలయం ఎస్‌ఐ శివాంజల్ కానిస్టేబుళ్లు రామకృష్ణ, నాగరాజులను అప్రమత్తం చేశారు. వారు నదీ తీరంలో గాలింపు చేపట్టి సౌమ్య శివానంద, కుమారుడు భువనేష్, కూతురు చార్విని గుర్తించి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఎస్‌ఐ కౌన్సిలింగ్ ఇచ్చి ఆమె సోదరులు సనత్‌కుమార్, సచిన్, రాహుల్‌ను పిలిపించి అప్పగించారు.


