పసుపు పంటపై విష ప్రయోగం
● వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యుడి పొలంపై దుండగుల దాష్టికం
చాగలమర్రి: చిన్నవంగలి గ్రామానికి చెందిన రైతు, వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యుడు కంసాని లక్ష్మీ రెడ్డికి చెందిన పసుపు పంటపై గుర్తు తెలియని దండగులు గడ్డి మందు పిచికారీ చేశారు. లక్ష్మీరెడ్డి మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో పసుపు పంట సాగు చేశాడు. ఏపుగా పెరిగిన పసుపు పంటను చూసి ఓర్వ లేని దుండగులు శనివారం అర్ధరాత్రి సమయంలో 3 రకాల గడ్డి మందులను పొలం బోరు వద్ద ఉన్న డ్రిప్ ట్యాంకు నీటిలో కలిపి ఆ మందు సీసాలను ట్యాంకులోనే వేశారు. అలాగే ఆ మందులు కలిపిన నీటిని పసుపు పంటపై కొంత మేర పిచికారీ చేశారు. ఆది వారం ఉదయం రైతు లక్ష్మీరెడ్డి పసుపు పంట పొలం వద్దకు వచ్చి పరిశీలించగా, కొంత విస్తీర్ణంలో పసుపు మట్టలు కాలిపోయిన వర్ణంలో కనిపించాయి. అనుమానంతో డ్రిప్ ట్యాంకును పరిశీలించగా ట్యాంకులో గడ్డి మందు సీసా కనబడటంతో పంటపై విష ప్రయోగం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పసుపు పంటపై విష ప్రయోగం


