క్లస్టర్ యూనివర్సిటీలో నాణ్యమైన విద్య
● ఏపీ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ విజయ భాస్కర్ రావు
కర్నూలు సిటీ: క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఆచార్య ఎస్. విజయ భాస్కర్ రావు అన్నారు. క్లస్టర్ వర్సిటీ పరిధిలోని మూడు కాలేజీల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులతో శనివారం సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వర్సిటీ పరిధిలోని మూడు కాలేజీల్లో మల్టీ డిస్సిప్లినరీ విధానాన్ని అవలంబించాలన్నారు.ఇన్‌చార్జ్ వీసీ వెంకట బసవరావు మాట్లాడుతూ.. వర్సిటీ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో తొమ్మిది పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలను విజయవంతంగా ప్రారంభించామన్నారు. వర్సిటీ ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్, కేవీఆర్ మహిళా డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ ఇందిరా శాంతి పాల్గొన్నారు.


