న్యాయం కోసం కోర్టుకెళ్తాం
● కోరం లేదని చెప్పడం
హాస్యాస్పదంగా ఉంది
● మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి,
ఎమ్మెల్సీ మధుసూదన్
ఆదోని టౌన్: ఎంపీపీ దానమ్మపై అవిశ్వాస తీర్మానం వీగిపోయేలా చేసి అడ్డదారిలో గెలిచేందుకు కూటమి నాయకుల కుయక్తులు పన్నారని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్ మండిపడ్డారు. న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తామన్నారు. బుధవారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ పార్టీ తరఫున గెలిచి బీజేపీలోకి వెళ్లిన ఎంపీపీ దానమ్మపై అవిశ్వాస తీర్మానానికి వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈరోజు అవిశ్వాసం ఉందని సబ్‌కలెక్టర్ కార్యాలయానికి వెళ్తే అక్కడ ఇన్‌చార్జి సబ్‌కలెక్టర్ అజయ్‌కుమార్ లేరని, చాలా సేపు వేచి ఉండడం జరిగిందన్నారు. ఆ తర్వాత ఎంపీడీఓ కార్యాలయంలో ఇన్‌చార్జి సబ్‌కలెక్టర్ ఉన్నారని తెలిసి ఎంపీటీసీలతో కలిసి అక్కడికి వెళ్లి అవిశ్వాస తీర్మానం పత్రాన్ని అందజేసేందుకు వెళ్తే... మీరు ఇక్కడికి రాకూడదని ఇన్‌చార్జి సబ్‌కలెక్టర్ చెప్పడం సరికాదన్నారు. చివరకు కోరం లేదని ఇన్‌చార్జ్ సబ్‌కలెక్టర్ చెప్పడం హాస్యస్పదంగా ఉందన్నారు. 26 మందిలో ఇద్దరు చనిపోగా, ఒకరు రాజీనామా చేయగా, 23 మంది మిగిలారన్నారు. ఇందులో 16 మంది వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన ఎంపీటీసీలు ఉండగా, ప్రస్తుతం ఉన్న 23 మంది ఎంపీటీసీల్లో 2/3లో 15 మంది కోరం ఉంటే సరిపోతుందని, దీనిని పట్టించుకోకుండా అవిశ్వాసం వీగిపోయిందని ఇన్‌చార్జి సబ్‌కలెక్టర్ చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ఇదంతా చూస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం అడ్డదారిలో అవిశ్వాసం వీగిపోయేలా కుట్రపన్నిందన్నారు. దీనిపై న్యాయం కోసం కోర్టుకు వెళ్తామని చెప్పారు. సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్సీపీ తరపు ఎంపీటీసీలు పాల్గొన్నారు.


