శ్రీశైలం ఘాట్‌లో బస్సు, కారు ఢీ
ఐదుగురికి గాయాలు
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం ఘాట్ రోడ్డులో మంగళవారం ఉదయం బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన భక్తులు కారులో శ్రీశైలం వస్తున్నారు. 9 కిలోమీటర్ల దూరంలో శిఖరేశ్వరం సమీపంలో ఎదురుగా వస్తున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో రవికుమార్(64), ప్రభావతి (54), వాసుదేవయ్య (36), తేజస్విని (30) గాయపడ్డారు. వీరిని 108 వాహనం ద్వారా శ్రీశైలం ప్రాజెక్ట్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తీవ్రంగా గాయపడిన రవికుమార్, ప్రభావతిలను మెరుగైన వైద్యం కోసం రెఫర్ చేశారు. ప్రకాశం జిల్లా దోర్నాల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీశైలం ఘాట్‌లో బస్సు, కారు ఢీ


