
వెండి రథంపై దివ్య తేజం
మంత్రాలయం: శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో ఆదివారం రాత్రి వెండి రథయాత్ర రమణీయంగా సాగింది. వెండి రథంపై ప్రహ్లాద రాయులను అధిష్టింపజేసి భక్త జనం మధ్య ఊరేగింపు చేపట్టారు. శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థమై ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. మందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శనం చేసుకొని అనంతరం శ్రీ రాఘవేంద్రస్వామి మూలబృందావనాన్ని దర్శించుకున్నారు. అన్నపూర్ణ భోజనశాల, పరిమళ ప్రసాద కౌంటర్ల ముందు భక్తుల రద్దీ కనిపించింది.