టీడీపీ నాయకులు ‘ఉపాధి’ సిబ్బందితో కుమ్మకై ్క గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను కొల్లగొట్టారు. కనీవినీ ఎరుగని రీతిలో 80 శాతం నిధులు స్వాహా చేసి 20 శాతం మాత్రమే ఖర్చు చేశారు. ఇంత స్థాయిలో అక్రమాలు జరిగినా సామాజిక బృందాలు బయటకు తీయలేకపోయాయి. ఓపెన్‌ ఫోరం నిర్వహ | - | Sakshi
Sakshi News home page

టీడీపీ నాయకులు ‘ఉపాధి’ సిబ్బందితో కుమ్మకై ్క గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను కొల్లగొట్టారు. కనీవినీ ఎరుగని రీతిలో 80 శాతం నిధులు స్వాహా చేసి 20 శాతం మాత్రమే ఖర్చు చేశారు. ఇంత స్థాయిలో అక్రమాలు జరిగినా సామాజిక బృందాలు బయటకు తీయలేకపోయాయి. ఓపెన్‌ ఫోరం నిర్వహ

Sep 15 2025 8:23 AM | Updated on Sep 15 2025 8:23 AM

టీడీపీ నాయకులు ‘ఉపాధి’ సిబ్బందితో కుమ్మకై ్క గ్రామీణ ఉప

టీడీపీ నాయకులు ‘ఉపాధి’ సిబ్బందితో కుమ్మకై ్క గ్రామీణ ఉప

కర్నూలు(అగ్రికల్చర్‌): రాష్ట్రంలోకూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2024–25లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా లేబర్‌ కాంపోనెంట్‌ కింద ఉమ్మడి జిల్లాలో రూ.675 కోట్లు ఖర్చు చేశారు. ‘ఉపాధి’ సిబ్బందితో కూటమి పార్టీల నేతలు కుమ్మకై ్క నిధులను కొల్లగొట్టారని విమర్శలు వచ్చాయి. ఇందుకు గ్రామస్థాయిలో పనిచేసే ఫీల్డ్‌ అసిస్టెంట్లను తప్పించి కూటమి పార్టీలు తమ కార్యకర్తలను నియమించుకున్నారు. ఏపీవోలు, సాంకేతిక సహాయకులు, ఈసీలు తదితరులందరినీ తమకు అనుకూలమైన వారిని నియమించుకున్నారు. ‘ఉపాధి’ నిధుల్లో జరిగిన అక్రమాలను సామాజిక తనిఖీ బృందాలు వెలికి తీయాల్సి ఉంది. అయితే ఆ బృందాలు అక్రమాలే లేవంటూ క్లీన్‌చీట్‌ ఇస్తుండటం పలు అనుమానాలకు తావు ఇస్తోంది.

సర్వత్రా ఆశ్చర్యం!

కర్నూలు జిల్లాలో 2024–25లో లేబర్‌ కాంపోనెంటు కింద రూ.276 కోట్లు, మెటీరియల్‌ కాంపోనెంటు కింద రూ.105 కోట్లు, నంద్యాల జిల్లాలో కాంపోనెంటు కింద రూ.205, మెటీరియల్‌ కాంపోనెంటు కింద రూ.89 కోట్లు ఖర్చు చేశారు. ఉపాధి సిబ్బంది, కూటమి పార్టీల నేతలు కుమ్మకై ్క నిధులు కొల్లగొట్టినప్పటికీ సామాజిక తనిఖీ బృందాలకు ఇవేమీ కనిపించలేదు. ఒక్క శాతం కూడా దుర్వినియోగం లేని విధంగా ఉపాధి పనులు జరుగుతున్నట్లు సోషల్‌ ఆడిట్‌ టీమ్‌లు లెక్కలు చెబుతుండటం పట్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. ‘ఉపాధి’ పనులు ఇంత సవ్యంగా జరుగుతున్నాయా అంటూ ముక్కున వేలేసుకునే పరిస్థితి ఏర్పడుతోంది.

నిధుల స్వాహా ఇలా..

సి.బెళగల్‌, ఎమ్మిగనూరు, గూడూరు, ఆస్పరి మండలాల్లో సోషల్‌ ఆడిట్‌ ఇప్పటికే పూర్తి అయ్యింది. ఓపెన్‌ ఫోరం కూడా నిర్వహించారు. ఇప్పటి వరకు సోషల్‌ ఆడిట్‌ జరిగిన నాలుగు మండలాల్లో నిధులు చాలా తక్కువగా దుర్వినియోగం అయ్యిందని తేల్చారు. లేబర్‌ కాంపోనెంట్‌ నిధులు 60 శాతం పక్కదారి పట్టినా బృంద సభ్యులు లేదని చెబుతున్నారు. చాలా చోట్ల కూలీలతో చేయించాల్సిన పనులను యంత్రాలతో చేసి నిధులు స్వాహా చేశారు. పది మంది పనిచేస్తే ఒకే ఫొటో 10 మస్టర్లకుపైగా వేసి నిధులు స్వాహా చేశారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాల్లో దొంగ మస్టర్లతో నిధులు స్వాహా చేసినట్లు విమర్శలు ఉన్నాయి. మెటీరియల్‌ కాంపోనెంటు కింద చేపట్టే పనుల్లో అక్రమాలదే పై చేయి. అయినా సామాజిక తనిఖీ బృందాలు వెలికి తీస్తున్న అవినీతి, అక్రమాలు చాలా స్వల్పంగా ఉంది.

తనిఖీలు నామమాత్రం

కర్నూలు జిల్లాలో రెండు, నంద్యాల జిల్లాలో రెండు సోషల్‌ ఆడిట్‌ టీమ్‌లు పనిచేస్తున్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు చేసిన తొలినాళ్లలో సామాజిక తనిఖీలంటే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. నేడు సామాజిక తనిఖీలు నామమాత్రం అయ్యాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్‌ ఆడిట్‌లో పారదర్శకత కనిపించడం లేదని అధికారులే పేర్కొంటున్నారు. ఓపెన్‌ఫోరంలో చూపిన నామమాత్రపు అక్రమాలు కూడా మధ్యలోనే డ్రాప్‌ అయిపోతున్నాయి. రికవరీ రూ.2 లక్షలు, రూ.3 లక్షల వరకు మాత్రమే ఉంటోంది. సామాజిక తనిఖీ బృంద సభ్యులు కొందరు అక్రమాలు చేసిన ‘ఉపాధి’ సిబ్బంది, టీడీపీ నేతలతో కుమ్మకై ్క చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని విమర్శలు ఉన్నాయి.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ

పథకంలో అన్నీ అక్రమాలే

‘ఉపాధి’కి 2024–25లో

ఉమ్మడి జిల్లాలో రూ.675 కోట్ల ఖర్చు

కూటమి పార్టీల నేతలు కుమ్మకై ్క

నిధులను కొల్లగొట్టిన వైనం

ఒకే ఫొటో 10 నుంచి

15 మస్టర్లు వేసి నిధుల స్వాహా

ౖపైపెనే సామాజిక బృందాల

తనిఖీలు

వంద శాతం పనులు

పారదర్శకం అంటూ నివేదిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement