
కూలీల జాతర!
ఒకరు.. ఇద్దరు కాదు.. వందలాది మంది కూలీలు..పొగాకు నారుమడుల్లో పనిచేస్తూ శనివారం కనిపించారు. కర్నూలు మండల పరిధిలోని దిగువపాడు, గార్గేయపురం, పడిదెంపాడు, ఇ.తాండ్రపాడు తదితర గ్రామాల్లో పొగాకు నారు తీస్తున్నారు. అలాగే నాట్లు వేస్తున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున కూలీలు పొలాలకు వచ్చి జాతరను తలపించారు. గార్గేయపురం సమీపంలోని ఒక పొలంలో ఈ దృశ్యం కనిపించింది. ఒక ఎకరాలో పొగాకు నాటు వేయలంటే 7,500 మొక్కలు అవసరం. ఎకరా పొగాకు నారును రూ.5,000 నుంచి రూ.6,000 వరకు విక్రయిస్తున్నట్లు రైతులు తెలిపారు.
– కర్నూలు(రూరల్)

కూలీల జాతర!