జాతీయ లోక్‌ అదాలత్‌లో 8,122 కేసుల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

జాతీయ లోక్‌ అదాలత్‌లో 8,122 కేసుల పరిష్కారం

Sep 14 2025 3:19 AM | Updated on Sep 14 2025 3:21 AM

కర్నూలు: జాతీయ లోక్‌ అదాలత్‌లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 8,122 కేసులు పరిష్కారమయ్యాయి. జాతీయ లోక్‌ అదాలత్‌, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి ఆధ్వర్యంలో శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. శ్రీశైలం ప్రాజెక్టు భూసేకరణలో నష్టపోయిన 60 మంది రైతుల వారసులకు రూ.83,96,374 నష్టపరిహారాన్ని జిల్లా జడ్జి చేతుల మీదుగా ఇప్పించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి మాట్లాడుతూ కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 20 బెంచీలను ఏర్పాటు చేసి 8,122 కేసులను పరిష్కరించామన్నారు. మొదటి అదనపు జిల్లా జడ్జి కమలా దేవి, 6వ అదనపు జిల్లా జడ్జి వాసు, సీబీఐ కోర్టు జిల్లా జడ్జి శోభారాణి, కర్నూలు బార్‌ ప్రెసిడెంట్‌ హరినాథ్‌ చౌదరి, శాశ్వత లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ వెంకట హరినాథ్‌, రిటైర్డ్‌ అదనపు జిల్లా జడ్జి లక్ష్మీనరసింహా రెడ్డి, ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి మల్లేశ్వరి, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి సరోజనమ్మ, జూనియర్‌ సివిల్‌ జడ్జి కిరణ్‌కుమార్‌, కోర్టు మానిటరింగ్‌ సీఐ రామయ్య నాయుడు, న్యాయవాదులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement