
ఉల్లి గడ్డలతో నిండిపోయిన మార్కెట్
కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లిగడ్డలతో కర్నూలు వ్యవసాయ మార్కెట్ నిండిపోయింది. మార్కెట్‌లోని అన్ని షెడ్లు, కమీషన్ ఏజెంటు దుకాణాల ఎదుట ఉల్లి సంచులే కనిపిస్తున్నాయి. రైతులు శనివారం సరుకును తీసుకురాలేదు. ఇది వరకే మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసిన ఉల్లి మార్కెట్ యార్డులో పేరుకపోయింది. మరోవైపు వ్యాపారులు కొనకుండా వదిలేసిన లాట్లు వందలాదిగా ఉండిపోయాయి. దీనిని మార్క్‌ఫెడ్ కొనాల్సి ఉంది. సోమవారం ఉదయం లోపు ఖాళీ అయితేనే రైతులు తెచ్చిన ఉల్లిని అమ్మకానికి పెట్టే అవకాశం ఉంది. కుళ్లిపోయిన ఉల్లిగడ్డలు గుట్టలుగా ఉండిపోవడం, మార్కెట్ యార్డులో పారిశుద్ధ్యలోపం ఎక్కువ కావడంతో దుర్వాసన వస్తోంది.