
దుస్తులు ఇస్త్రీ చేస్తుండగా..
వెలుగోడు: దుస్తులు ఇసీ్త్ర చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన శనివారం మోతుకూరు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దావీదు, లక్ష్మీదేవి దంపతులకు నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు పోసి ఓబులేస్ (21) సంతానం. పిల్లల చిన్నతనంలో తండ్రి దావీదు మరణించడంతో తల్లి కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించింది. కుమారుడు ఓబులేస్ నంద్యాల పట్టణంలోని ఇమేజ్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్ని షియన్‌గా పని చేస్తున్నాడు. ప్రతి రోజులాగే శనివారం ఆసుపత్రికి వెళ్లేందుకు సిద్ధపడే క్రమంలో ఉదయం దుస్తులు ఇసీ్త్ర చేసేందుకు గదిలోకి వెళ్లాడు. ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడ గా విగతజీవిగా పడి ఉన్నాడు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే చనిపోయినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు అక్కలు, ఇద్దరు చెల్లెల్ల మధ్యలో పుట్టిన ఓబులేస్ తండ్రి బాధ్యతలు నిర్వహించే క్రమంలో ఇలా అకాల మరణం చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించడం పలువురుని కలిచివేసింది. ఈ ఘటన గ్రామంలో విషాదం నెలకొంది.
‘వేదావతి’ వంతెనపై తగ్గిన వరద నీరు
హొళగుంద: మార్లమడి గ్రామం వద్ద ఉన్న వేదావతి(హగరి) నదిపై నిర్మించిన వంతెనపై వరద నీరు తగ్గింది. దీంతో కర్ణాటక రాష్ట్రానికి రాకపోకలు పునః ప్రారంభమయ్యాయి. ఇటీవల కురిసిన భారీ వర్షానికి వంతెనపై వరద నీరు ప్రవహించి శుక్రవారం రెండు వైపులా రాకపోకలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బళ్లారి, సిరుగుప్ప తదితర ప్రాంతాలకు రాకపోకలు పునః ప్రారంభ మయ్యాయి.
కర్నూలు : నగర శివారులోని గుత్తి పెట్రోల్ బంకు సమీపంలో ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముని లక్ష్మయ్య (40) మృతిచెందారు. కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా సంగహల్లి గ్రామానికి చెందిన లక్ష్మయ్య బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు లారీలో బీట్‌రూట్ లోడ్‌తో వెళ్తూ గుత్తి ఫ్లైఓవర్ బ్రిడ్జిపైన రోడ్డు పక్కన ఆపుకుని ఉండగా అటుగా వెళ్తున్న ఐచర్ వాహనం తగిలి తలకు, కాళ్లకు బలమైన రక్తగాయాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని అంబులెన్స్‌లో ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని మార్చురీ కేంద్రానికి తరలించి భద్రపరిచారు. ఇతనికి భార్యతో పాటు కుమారుడు సంతానం. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మందుబాబులకు జరిమానా
కర్నూలు: రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసు శాఖ చేపట్టిన డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన 79 మంది మందుబాబులకు రూ.3.95 లక్షలు జరిమానా విధిస్తూ కర్నూలు జేఎఫ్‌సీఎం కోర్టు న్యాయమూర్తి అనిల్ కుమార్ తీర్పు చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడి తప్పించుకు తిరుగుతున్న 79 మందిని శనివారం మెగా లోక్ అదాలత్‌లో హాజరుపర్చగా ఒక్కొక్కరికి రూ.5 వేలు చొప్పున జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

దుస్తులు ఇస్త్రీ చేస్తుండగా..

దుస్తులు ఇస్త్రీ చేస్తుండగా..