
పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోంది. ప్రెస్ మీట్‌లో ఓ నేత ఇచ్చిన వార్తను ప్రచురిస్తే కేసులు పెట్టడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలను నిర్భయంగా ప్రజలకు కళ్లకు కట్టినట్లు తెలియజేస్తున్న ‘సాక్షి’ దినపత్రికపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తూ సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై, సంబంధిత జర్నలిస్టుపై అక్రమ కేసులు పెట్టి వేధించడం దుర్మార్గమైన చర్య. వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’పై కూటమి ప్రభుత్వం మొదటి నుంచి వేధించే ధోరణి అవలంబిస్తోంది. ఎమర్జెన్సీ లాంటి పాలన ఇలాగే కొనసాగితే ప్రజా ఉద్యమం తప్పదు. – కంగాటి శ్రీదేవి, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే