
వాల్మీకి ఉద్యోగ సంఘం ప్రధాన కార్యదర్శిగా బోయ లక్ష్మీనార
కర్నూలు(అర్బన్): వాల్మీకి ఉద్యోగ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జిల్లాకు చెందిన డాక్టర్ బోయ లక్ష్మీనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివా రం అనంతపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి వాల్మీకి ఉద్యోగుల సమావేశంలో రాష్ట్ర కమిటీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో లక్ష్మీనారాయణతో పాటు జిల్లాకు చెందిన గవిగట్టు లక్ష్మీకాంత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, సహాయ కార్యదర్శిగా నల్లబోతుల రఘునాథ్ ఎన్నికై నట్లు జిల్లా వాల్మీకి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మల్దన్న, ప్రధాన కార్యదర్శి సుధాకర్‌బాబు, కోశాధికారి వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. వాల్మీకి ఉద్యోగుల సంక్షేమం కోసం, వాల్మీకి విద్యార్థుల భవిష్యత్తు కోసం రాష్ట్ర నాయకత్వం సమర్థవంతంగా పనిచేస్తుందనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు.