
అప్రకటిత ఎమర్జెన్సీ!
విధి నిర్వహణలో భాగంగా జర్నలిస్టులు వార్తలు ఇస్తుంటారు. అయితే అధికార పార్టీ నేతలు ఇవి గుర్తించుకుండా ‘సాక్షి’ జర్నలిస్టులను రాజకీయాలు అపాదించడం అన్యాయం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో వార్తలు రాసిన ‘సాక్షి’
జర్నలిస్టులు, ఎడిటర్‌పై కేసులు నమోదు చేస్తున్నారు. కడపలో సాగునీటి సంఘాల ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికల్లో కవరేజ్‌కు వెళ్లిన వారిపై కూడా దాడులు జరిగాయి. కర్నూలులోనూ సాక్షి జర్నలిస్టులపై కేసులు పెట్టారు. ఇలా కేసులు పెట్టుకుంటూ పోతుండడంతో ప్రజాస్వామ్యానికే ఇబ్బందికరంగా మారింది. ఒకరకంగా చెప్పాలంటే అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. ఇది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వం ఆలోచన చేయాలి. జర్నలిస్టులను ఇబ్బందులు పెడితే ఆందోళనలకు సిద్ధమవుతాం. – ఈఎన్ రాజు, జిల్లా కార్యదర్శి, ఏపీయూడబ్ల్యూజే