
ఆగివున్న ట్యాంకర్‌ను ఢీకొట్టిన లారీ
కోడుమూరు రూరల్: కోడుమూరు – కర్నూలు రహదారిలో కొత్తూరు వద్ద ఆగి ఉన్న ట్యాంకర్‌ను ప్రమాదవశాత్తూ లారీ ఢీకొంది. బళ్లారి నుంచి గడివేములకు వెళ్తున్న ఓ లారీ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఆగివున్న ట్యాంకర్‌ను వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం నుజ్జునుజ్జు అయినా లారీ డ్రైవర్ విజయ్ క్షేమంగా బయటపడ్డాడు.
మెట్లపై నుంచి జారి పడి వ్యక్తి మృతి
కోవెలకుంట్ల: పట్టణంలోని బొల్లవరం వీధిలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి మెట్లపై నుంచి జారి పడి మృతి చెందాడు. ఆదివారం ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు.. కాలనీకి చెందిన ఆకుల రమణయ్య(59) శనివారం సాయంత్రం ఇంటిపైన ఉన్న వస్తువును అందుకునేందుకు మెట్లపైకి ఎక్కి ప్రమాదవశాత్తు కింద పడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కోలుకోలేక మృతి చెందాడు. మృతుని భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
కొనసాగుతున్న గాలింపు
ఉయ్యాలవాడ: కుందూనదిలో శనివారం దూకిన వృద్ధురాలు గుత్తి ఫకూర్‌బీ కోసం ఆదివారం తహసీల్దార్ ప్రసాద్‌బాబు ఆధ్వర్యంలో నంద్యాల ఎస్‌డీఆర్‌ఎప్ బృందం గాలింపు చర్యలు చేపట్టింది. అనారోగ్య కారణాలతో వృద్ధురాలు కుందూనదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. నీటి ఉద్ధృతి అధికంగా ఉండటంతో ఆమె ఆచూకీ గల్లంతు అయ్యింది. ఎస్‌డీఆర్‌ఎప్ ఆర్‌ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, ధనుంజయ, గిడ్డయ్యలతో పాటు మరి కొందరు బోట్ ద్వారా మండల పరిధిలోని పెద్దయమ్మనూరు, బోడెమ్మనూరు వద్ద కుందూనదిలో గాలింపు చర్యలు ప్రారంభించారు. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు చాగలమర్రి మండలం రాజోలు వరకు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ వృద్ధురాలి ఆచూకీ లభ్యం కాలేదని తహసీల్దార్ తెలిపారు.

ఆగివున్న ట్యాంకర్‌ను ఢీకొట్టిన లారీ

ఆగివున్న ట్యాంకర్‌ను ఢీకొట్టిన లారీ