
అవస్థల ఒడి!
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
ఆదర్శ బడి ..
కోసిగి: పేరుకే అది ఆదర్శ పాఠశాల. అందులో కనీస సౌకర్యాలు లేవు. విద్యార్థులు నేలపైనే కూర్చొని పాఠాలు వినాల్సి వస్తోంది. తరగతి గదుల పైకప్పు పెచ్చులూడి పడిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మోడల్ పాఠశాలకు ఇప్పటి వరకు మరమ్మతులు చేపట్టలేదు. బోధన సామగ్రిని అందించలేదు. మండల కేంద్రమైన కోసిగి నుంచి 3 కిలో మీటర్లు దూరంలో సజ్జలగుడ్డం రోడ్డులోని పొలాలలో ఏపీ మోడల్ స్కూల్ ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలలో 2014 నుంచి నూతనంగా తరగతి గదుల నిర్మాణం చేపట్టి విద్యను ప్రారంభించారు. ఇక్కడ 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 530 మంది విద్యార్థులు చదువుతున్నారు.
‘నడక’ నరకయాతన
ఏపీ మోడల్ స్కూల్ కోసిగి గ్రామానికి మూడు కిలో మీటర్ల దూరంలో ఉంది. పాఠశాల వెళ్లేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు రోజు నరకం చూస్తున్నారు. కోసిగి నుంచి రైల్వేగేటు మీదుగా కాలినడక, మరికొందరు గాంధీనగర్ నుంచి పొలాల్లో పాఠశాలకు వెళ్తున్నాపరు. సజ్జలగుడ్డం గ్రామం మెయిన్ రోడ్డు నుంచి పాఠశాల వద్దకు వెళ్లే దారి వర్షం వస్తే నడవడానికి వీలు లేకుండా చిత్తడిచిత్తడి మారుతోంది. దీంతో ప్రతి రోజు తీరని అవస్థలు పడుతున్నారు. కోసిగి నుంచి పాఠశాలకు విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు.
వసతి.. దుస్థితి
ఏపీ మోడల్ స్కూల్ హస్టల్‌లో 9,10, ఇంటర్మిడియట్ చదువుతున్న గ్రామీణ ప్రాంతాల విద్యార్థినులకు కోసం హాస్టల్ వసతి ఏర్పాటు చేశారు. మొత్తం 100 మందికి గాను 84 మంది ప్రస్తుతం ఉన్నారు. హాస్టల్ పై భాగంలోని ఐదు గదులు పెచ్చులూడి ప్రమాదకరంగా ఉనప్నాయి. ఒక గదిలో నలుగురు విద్యార్థులు ఉండాల్సిన ఉంది. అయితే ఆరుగురు చొప్పున ఉండాల్సి దుస్థితి ఏర్పడింది.
ఇవీ సమస్యలు..
● పాఠశాల రెండో అంతస్థులోని 7 తరగతి గదులు, ఒక హాల్‌పై కప్పు పెచ్చులూడి కిందకు పడిపోతోంది.
● పాఠశాల తరగతి గదుల పై భాగంలో గోడలు కూడా చీలకలు ఏర్పడ్డాయి.
● ఇటీవల కురిసిన వర్షాలకు పాఠశాల వేళలోనే ఒక్క సారి తరగతి గది పెచ్చులూడిి పడిపోవడంతో పెద్ద శబ్దం వచ్చింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు. ఆ గదిని వాడకుండా ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పిందని పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.
● ఏడాది పాటుగా కొన్ని గదులు, ఒక హాల్‌కు తాళం వేసి నిరుపయోగంగా వదిలేశారు.
● ఒక తరగతికి చెందిన రెండు సెక్షన్లను ఒకే గదిలో, మరికొన్ని క్లాసులు సైన్స్ ల్యాబ్‌లో నిర్వహిస్తున్నారు.
● విద్యార్థులకు కూర్చునే బల్లులు లేవు. దీంతో 6,7వ తరగతి విద్యార్థులను నేల పైనే కూర్చొబెడుతున్నారు.
● పాఠశాల అటవీ ప్రాంతంలో ఉండటంతో విష పురుగుల సంచారం కనిపిస్తోంది.
ఇరుక్కు గదుల్లో తరగతులు
పెచ్చులూడి పడిపోతున్న పైకప్పు
విద్యార్థులకు తప్పని నేలబారు
చదువులు
పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
పాఠశాల రెండో అంతస్థు పైకప్పు ప్రమాదకరంగా ఉంది. ముందస్తుగా గమనించి ఆ గదులకు తాళాలు వేయించాం. విదార్థులు అటు వైపు వెళ్లకుండా చూస్తున్నాం. ఈ విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. కింది భాగంలోనే ఉన్న తరగతి గదుల్లో రెండు సెక్షన్లను కలిపి విద్యను బోధిస్తున్నాం.
– సుందర్ కుమార్, ప్రిన్సిపాల్

అవస్థల ఒడి!

అవస్థల ఒడి!

అవస్థల ఒడి!

అవస్థల ఒడి!