
ప్రశ్నించే గొంతుకపై కక్ష సాధింపు..
అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలోనే ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న కూటమి ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఒక నాయకుడు ప్రెస్‌మీట్‌లో చెప్పిన అంశాలను ప్రచురిస్తే కేసులు పెట్టడం తగదు. నిన్నటి వరకు సోషల్‌మీడియా యాక్టివిస్ట్‌లు, ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపులకు పాల్పడిన కూటమి ప్రభుత్వం ఇప్పుడేమో ఏకంగా నిజాలను ప్రచురించే మీడియా/పత్రికలపై కక్ష సాధింపులకు దిగడం హేయమైన చర్య. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛపై గౌరవ భావం కలిగి ఉండాలి. భయపెట్టి నిజాలను కప్పివేయాలనుకోవడం సరికాదు. సాక్షి ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డి, ఇతర పాత్రికేయులపై వేసిన కేసులను కూటమి సర్కారు వెంటనే ఉపసంహరించుకోవాలి. – విరూపాక్షి, ఆలూరు ఎమ్మెల్యే