
నేడు కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్న డాక్టర్ ఏ.సిరి
కర్నూలు(సెంట్రల్): కర్నూలు నూతన కలెక్టర్‌గా నియమితులైన డాక్టర్ అట్టాడ సిరి శనివారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఉదయం 10 నుంచి 10.30 గంటల మధ్య ఆమె బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. కాగా, విజయవాడ నుంచి విమానంలో వచ్చిన ఎ.సిరికి ఓర్వకల్ విమనాశ్రాయంలో కర్నూలు, పత్తికొండ ఆర్డీఓలు కె.సందీప్‌కుమార్, భరత్‌నాయక్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె రోడ్డు మార్గన కర్నూలులోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకోగా డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ స్వాగతం పలికి విడిది ఏర్పాటు చేశారు. విశ్రాంతి తీసుకుంటున్న కలెక్టర్‌ను జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, కలెక్టరేట్ ఏఓ శివరాముడుతో పాటు పలు శాఖల అధికారులు కలసి పరిచయం చేసుకున్నారు. కాగా, ఇప్పటి వరకు కలెక్టర్‌గా పనిచేసిన పి.రంజిత్‌బాషా శుక్రవారం సాయంత్రం రిలీవ్ అయ్యారు. ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవడంతో జీఏడీలో రిపోర్టు చేసుకునే అవకాశం ఉంది.