
సమాచారం అందించడం ప్రభుత్వ బాధ్యత
● జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి పీఎల్ వరలక్ష్మి
కర్నూలు(అర్బన్): పాలనా వ్యవహారాల్లో గోప్యతను నివారించి ప్రభుత్వ విధానాలను ప్రజల ముందు ఉంచేందుకు పౌరులకు కల్పించిన అద్భుత అవకాశమే సమాచార హక్కు అని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి పీఎల్ వరలక్ష్మి అన్నారు. శుక్రవారం స్థానిక మద్దూర్‌నగర్‌లోని ప్రకృతి వ్యవసాయ హాల్‌లో సమాచార హక్కు చట్టం –2025పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ మాధురి, సీనియర్ కన్సల్టెంట్స్ లక్ష్మయ్య, రాజేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడు తూ సమాచారాన్ని ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని, సమాచారాన్ని పొందడం పౌరుల హక్కు అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రకృతి వ్యవసాయ పంట కొత్త ప్రయోగానికి సంబంధించిన 32 కిట్లను పంపిణీ చేశారు. ఈ కిట్లను ఉపయోగించుకొని ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా పండించిన పంట ఉత్పత్తుల దిగుబడులను కచ్చితమైన దిగుబడిని అంచనా వేసేందుకు ఉపయోగించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో డీపీఎంయూ సిబ్బంది, ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ సందీప్‌కుమార్, లావణ్య, ఎన్‌ఎఫ్‌ఏస్ తదితరులు పాల్గొన్నారు.