
విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు
తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల ఒకటవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ సంవత్సరం ‘తల్లిపాల సంస్కృతిని ప్రోత్సహిద్దాం’ అనే నినాదంతో ఈ కార్యక్రమాలతో అవగాహన కల్పిస్తున్నాం. ముఖ్యంగా ముర్రుపాలు తప్పనిసరిగా బిడ్డకు పట్టించాలని సూచిస్తున్నాం. బిడ్డకు పాలివ్వడం వల్ల తల్లులకు రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ల నివారణకు దోహదపడతాయని వివరిస్తున్నాం.
–డాక్టర్ పి.శాంతికళ, డీఎంహెచ్‌వో, కర్నూలు
తల్లిపాలతో బిడ్డకు అనుబంధం
బిడ్డ జన్మించిన అరగంటలోపే తల్లికి పాలు వస్తాయి. ఈ ముర్రుపాలను బిడ్డకు తప్పనిసరిగా పట్టించాలి. ఇందులో బిడ్డకు అవసరమైన వ్యాధినిరోధక శక్తి ఉండి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఆరు నెలల వరకు బిడ్డకు తల్లిపాలు మాత్రమే పట్టించాలి. ఈ పాల ద్వారా బిడ్డకు అవసరమైనంత పోషకాలు, విటమిన్లు, కాల్షియం, ప్రొటీన్ అందుతాయి. లైఫేజ్ అనే ఎంజైమ్ వల్ల బిడ్డ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ముఖ్యంగా బిడ్డకు తల్లి పాలివ్వడం వల్ల వారిద్దరి మధ్య బాంధవ్యం బలపడుతుంది.
– డాక్టర్ ఎం. విజయవాణి,
చిన్నపిల్లల వైద్యనిపుణులు, కర్నూలు

విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు