కర్నూలులో స్టేట్ క్యాన్సర్ ఇన్సిట్యూట్‌లో అన్ని సౌకర్యాలు, వసతులు సమకూర్చాక రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. పాత క్యాన్సర్ భవనంలో రోజుకు 10 నుంచి 15 రాగా ఇప్పుడు 25 నుంచి 30 మంది దాకా వస్తున్నారు. అందుబాటులో ఉన్న 120 పడకలు నిత్యం రోగులతో నిండిపోతున్నాయి. 80 శాతం మంది అడ్వాన్స్ (చివరి దశ)లో వస్తున్నారు. ముందుగానే గుర్తిస్తే క్యాన్సర్ చికిత్స సులభం అవుతుంది.
– డాక్టర్ సీఎస్‌కే ప్రకాష్, క్యాన్సర్ విభాగం హెచ్‌వోడి, కర్నూలు ప్రభుత్వ
సర్వజన వైద్యశాల
ధూమపానం,
కాలుష్యం కారణాలు
ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ధూమపానం, వాయు కాలుష్యం ప్రధాన కారణాలు. ధూమపానం మానేస్తే చాలా వరకు ఈ క్యాన్సర్ నుంచి బయటపడవచ్చు. ధూమపాన నివారణ కోసం నికోటిన్ ఉత్పాదక స్థాపన ఉత్పత్తులు, మందులు, సహాయక సమూహాలు ఉన్నాయి. ధూమపానం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్న 50 నుంచి 80 సంవత్సరాల వయస్సు గల పెద్దలు ప్రతి సంవత్సరం క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష చేయించుకోవాలి.
– డాక్టర్ సి. వాసురెడ్డి,
సర్జికల్ ఆంకాలజిస్టు, కర్నూలు
స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో పెరిగిన రోగులు