
ఫేక్ ట్రైనర్‌పై విచారణ
ఆలూరు: అరికెర గ్రామ అంబేడ్కర్ గురుకుల బాలుర పాఠశాలో స్కౌట్ అండ్ గైడ్స్ ట్రైనర్ పేరుతో ఇటీవల విద్యార్థులు, ఉపాధ్యాయులను మోసం చేసిన వైనంపై డీసీఓ శ్రీదేవి విచారణ చేపట్టారు. స్కౌట్ అండ్ గైడ్స్ ట్రైనర్ పేరుతో ఓ వ్యక్తి పాఠశాలలో వసూళ్లకు పాల్పడిన ఘటనపై సాక్షిలో ఈనెల 30వ తేదీన కథనం ప్రచురితమైయింది. ఈ మేరకు గురువారం ఆమె పాఠశాలను తనిఖీ చేసి ఈ విషయంపై ఆరా తీశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో విడివిడిగా సమావేశమై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వారంలోగా రెగ్యులర్ ప్రిన్సిపాల్ నియామకం జరుగుతుందన్నారు. విద్యార్థులు పట్టుదలతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఫేక్ ట్రైనర్ విషయంపై విచారణ జరుగుతుందన్నారు.