
అటకెక్కిన ‘ఆడబిడ్డ నిధి’
● 2024 ఎన్నికల సమయంలో ఊరూవాడా మారుమోగిన హామీ ● రూ.1,500 చొప్పున ఖాతాల్లో జమచేస్తామని ప్రచారం ● 14 నెలలు గడిచినా ఆ ఊసెత్తని కూటమి నేతలు ● ఇప్పుడు అమలుపై మాట మార్చిన సీఎం చంద్రబాబు ● ఆడబిడ్డల దృష్టి మళ్లించేందుకు తెరపైకి పీ–4 ● దాతల దయాదాక్షిణ్యాలు మాకొద్దని మహిళల ఆగ్రహం
ఉపాధ్యాయులను మినహాయించండి
ఆదోని సెంట్రల్: ప్రభుత్వం పీ–4 పథకం బాధ్యతల నుంచి ఉపాధ్యాయులను మినహాయించాల ని ఎస్టీయూ రాష్ట్ర పురపాలక కన్వీనర్ జి.వీరచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం గుర్తించిన పేద కుటుంబాలను సంపన్న వర్గాల కు చెందిన వారు దత్తత తీసుకొని వారికి ఆర్థికంగా తోడ్పాటు అందించే కార్యక్రమంలో ఉపాధ్యాయులను భాగస్వాములు కావాలనడం సరికాదన్నారు. ప్రతి ప్రధానోపాధ్యాయుడు ఐదు కుటుంబాలు, ప్రతి ఉపాధ్యాయుడు రెండు కుటుంబాలను దత్తత తీసుకొని మార్గదర్శులుగా నమో దు చేసుకోవాలని బలవంతం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జీతం మీద ఆధారపడిన ఉద్యోగులకు అంతస్థాయి ఎక్కడిదన్నారు. ఇప్పటికే బోధనేతర పనులతో సతమతం అవుతున్నామని, ఈ నేపథ్యంలోనే మరింత వేధింపులకు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు.