
సారా మానేస్తే ప్రత్యామ్నాయ ఉపాధి
కర్నూలు: నాటుసారా తయారీ, విక్రయాలను వదిలేస్తే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు అన్నారు. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా కర్నూలు ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని గుమ్మితం తండాలో నాటుసారా తయారీని పూర్తిగా మానుకున్న వారికి ఉపాధి మార్గాల్లో భాగంగా మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి హనుమంతరావుతో పాటు జిల్లా ఎకై ్సజ్ అధికారి (ఈఎస్) ఎం.సుధీర్ బాబు, ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రాజశేఖర్ గౌడ్ తదితరులు ముఖ్య అతిథులగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు మాట్లాడుతూ నాటుసారా తయారీ, విక్రయాలు మానేసిన కుటుంబాలందరినీ గ్రూపులుగా ఏర్పాటు చేసి డీఆర్‌డీఏ తరఫున ఉపాధి మార్గాలు, అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఎవరికి తగిన ఉపాధి మార్గాన్ని వారు ఎంచుకుని తదనుగుణంగా శిక్షణకు సిద్ధం కావాలని సూచించారు. సారా మానేసిన వ్యాపారులంతా గ్రూపులుగా తయారై పొదుపు సంఘాల తరహాలో ఏర్పాటై శిక్షణ కార్యక్రమాలను ఉపయోగించుకోవాలని సూచించారు. తండాను నాటుసారా రహిత గ్రామంగా ప్రకటించేందుకు ప్రజలందరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో కర్నూలు ఎకై ్సజ్ సీఐ చంద్రహాస్, ఎస్‌ఐ నవీన్ బాబు, డీఆర్‌డీఏ కమ్యూనిటీ కోఆర్డినేటర్ సోమన్న తదితరులు పాల్గొన్నారు.
ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్
కమిషనర్