
‘కొండంత’ వినాయకుడు!
ప్రకృతిని ఆస్వాదించాలే కానీ ప్రతీది మనసుకు హత్తుకుంటుంది. శిలలపై శిల్పాలు చెక్కినారని గొప్పగా పాడుకోవడమే కాదు.. నిశితంగా పరిశీలిస్తే కనిపించే ప్రతి రాయిలోనూ ఏదో ఒక రూపం సాక్షాత్కరిస్తుంది. పేరులోనే కొండను దాచుకున్న పత్తికొండ పరిసర ప్రాంతాల్లో ఎత్తయిన కొండలు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఎవరో పేర్చినట్లుగా ఉండే ఈ కొండలను చూసేందుకు రెండు కళ్లూ చాలవు. తుగ్గలి మండలం కోతికొండ గ్రామ సమీపంలోని ఓ కొండ అచ్చం వినాయక రూపాన్ని పోలి ఉండటంస్థానికులతో పాటు ఆ దారిన వచ్చివెళ్లే ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
– డి.హుస్సేన్,
సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు