
దాతల దయాదాక్షిణ్యాలు వద్దు
ఆడబిడ్డనిధి పథకాన్ని పక్కన పెట్టి పీ4 పేరిట ముఖ్యమంత్రి మహిళలను మోసం చేస్తున్నారు. పీ4 కింద ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయదు. దాతల దయాదాక్షిణ్యాల మీద బతికే పరిస్థితిని ముఖ్యమంత్రి తీసుకరావడం దారుణం. మాకు పీ–4 వద్దు.. ఆడబిడ్డ నిధి అమలు చేయాలి.
– ఆవుల ఆదిలక్ష్మి, జ్యోతి గ్రూపు,
కడమకుంట్ల, తుగ్గలి మండలం
అప్పుల ఊబిలో కూరుకుపోయాం
పొదుపు మహిళలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపై రూ.10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణా లు అమలు చేస్తామన్నారు. ఇంతవరకు ఆ ఊసే కరువైంది. బ్యాంకుల నుంచి రుణాలు పొందిన మహిళలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. మహిళా సంక్షేమానికి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దారుణం.
– బి.రమాదేవి, పొదుపు మహిళ,
రామకృష్ణాపురం, క్రిష్ణగిరి మండలం

దాతల దయాదాక్షిణ్యాలు వద్దు