
నదీతీరంలో శ్రీమఠం పీఠాధిపతి పర్యటన
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన మంత్రాలయం సమీపంలోని తుంగభద్ర నదీ తీరంలో శ్రీరాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు సోమవారం పర్యటించారు. రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు సమీపిస్తుండటంతో ఏర్పాట్లను పర్యవేక్షించారు. నదీ పరివాహక ప్రాంతంలో స్నానాలకు ఏర్పాటు చేసిన షవర్లను పరిశీలించారు. నదీ తీరంలో భక్తులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు సూచించారు.
మునిగిన స్నానపు ఘాట్లు
మంత్రాలయం రూరల్: వరద నీరు పోటెత్తడంతో తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మంత్రాలయంలో స్నానపు ఘాట్లు మునిగిపోయాయి. నదీతీర ప్రాంతంలో లోతట్టు పంట పొలాలు ఇప్పటికే జలమయం అయ్యాయి.