డీపీఓలో ఇద్దరు అధికారుల బదిలీ | - | Sakshi
Sakshi News home page

డీపీఓలో ఇద్దరు అధికారుల బదిలీ

Jul 29 2025 8:14 AM | Updated on Jul 29 2025 8:14 AM

డీపీఓ

డీపీఓలో ఇద్దరు అధికారుల బదిలీ

కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లా పోలీసు కార్యాలయంలో ఇద్దరు అధికారులు అయ్యారు. ఈ మేరకు డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ ఆమోదం తెలిపింది. గ్రేహౌండ్స్‌ విభాగంలో ఏఓగా పనిచేస్తున్న ఎస్‌.విజయలక్ష్మిని జిల్లా పోలీస్‌ కార్యాలయం ఏఓగా బదిలీ చేశారు. కడప జిల్లా పోలీసు అధికారి కార్యాలయంలో ఏఓగా పనిచేస్తున్న జ్యోతిని కర్నూలు డీపీసీఏ ఏఓగా బదిలీ చేశారు. ఈ మేరకు డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

కుటుంబ కలహాలతో

వివాహిత ఆత్మహత్య

కర్నూలు: కుటుంబ కలహాలతో షేక్‌ జాకియా (35) అనే వివాహిత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమె భర్త షేక్‌ డిరాంశ వెల్డింగ్‌ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సోమవారం ఇంట్లో అత్తతో గొడవపడి షేక్‌ జాకియా ఉరి వేసుకుంది. కొద్దిసేపటికి కుటుంబ సభ్యులు గుర్తించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈమెకు ఇద్దరు కూతుర్లు, కుమారుడు సంతానం. నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

టీడీపీ నాయకుల స్వలాభాపేక్ష

డోన్‌: ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా స్వలాభపేక్ష కోసం టీడీపీ నాయకులు డోన్‌ పట్టణ శివారులోని ఎంకె టౌన్‌షిప్‌ వద్ద ఏర్పాటు చేసిన సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం ఎదురుగా రేకుల షెడ్లు వేశారు. దీంతో ఆ స్థలం ఇరుకుగా మారడంతో దస్తాజులేఖరులతో పాటు ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారు. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి ఒకవైపు టీడీపీ నాయకుని షాపింగ్‌ కాంప్లెక్స్‌, ఎదురుగా ఏర్పాటు చేసిన అద్దెరేకుల దుకాణాల కారణంగా స్థలం లేకుండాపోయింది. మరో రెండు వైపులు వంకలు ఉండటంతో ప్రజలు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. కేవలం స్వలాభపేక్ష కోసం ప్రజలకు సౌకర్యాలు లేకుండా చేయడం టీడీపీ నాయకులకు తగదని ప్రజలు వాపోతున్నారు.

రిటైర్డ్‌ డీఎస్పీపై దాడి

ఆదోని అర్బన్‌: పట్టణంలోని ఎస్కేడీ కాలనీలో నివాసముంటున్న రిటైర్డ్‌ డీఎస్పీ రఘునాథ్‌చారిపై ముగ్గురి వ్యక్తులు దాడి చేశారు. టూటౌన్‌ సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. కొన్ని రోజుల క్రితం రిటైర్డ్‌ డీఎస్పీకి ప్లాటు ఇస్తానని బిల్డర్‌ రాఘవేంద్రరెడ్డి అనే వ్యక్తి డబ్బు అడ్వాన్సుగా తీసుకున్నాడు. ప్లాట్‌ ఇవ్వకపోవడంతో సోమవారం రిటైర్డ్‌ డీఎస్పీ డబ్బు తిరిగి అడిగినందుకు రాఘవేంద్రరెడ్డితో పాటు మరో ఇద్దరు దాడి చేశారు. రిటైర్డ్‌ డీఎస్పీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

ప్రకృతి రక్షణ అందరి బాధ్యత

నంద్యాల(న్యూటౌన్‌): ప్రకృతి వనరులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా ఫారెస్ట్‌ అధికారి అనురాగ్‌మీనా పేర్కొన్నారు. ప్రపంచ ప్రకృతి సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆవరణలో అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఫారెస్ట్‌ అధికారి మాట్లాడుతూ ప్రకృతి వనరులైన అడవులు, నీరు, గాలి, భూమి ఇతర జీవ సంపదను సంరక్షించాల్సిన అవసరాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాలని సూచించారు. ప్రకృతి సంరక్షణపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అనంతరం రామకృష్ణారెడ్డి, ప్రొఫెసర్‌ ప్రగతిరెడ్డి, ప్రిన్సిపాల్‌ సుబ్బయ్య పాల్గొన్నారు.

డీపీఓలో ఇద్దరు అధికారుల బదిలీ  1
1/1

డీపీఓలో ఇద్దరు అధికారుల బదిలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement