
దుప్పిని వేటాడి.. మాంసాన్ని విక్రయించి!
ఆళ్లగడ్డ: నిషేధిత ఆయుధాలతో అడవిలోకి ప్రవేశించిన వేటగాళ్లు దుప్పిని వేటాడి, దాని మాంసాన్ని విక్రయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అటవీ శాఖ అధికారి మూర్తుజావలి తెలిపిన వివరాల మేరకు.. అహోబిలం గ్రామానికి చెందిన కొందరు వేటగాళ్లు 27వ తేదీ అహోబిలం నార్త్ బీటులోని నూతల బావి రస్తా సమీపంలో ఉండగా గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా అందులో ముగ్గురు పరారీ కాగా ఒకరు పట్టుబడ్డాడు. అధికారుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పట్టుబడిన ప్రభాకర్‌ను సోమవారం కోర్టులో హాజరు పరచగా రిమాండ్‌కు తరలించారు. పారిపోయిన ముగ్గురు వ్యక్తులను గుర్తించి త్వరలో అరెస్ట్ చేస్తామ న్నారు. కాగా అహోబిలం గ్రామం సమీపంలోని టేకు ప్లాట్‌లో శనివారం అహోబిలం గ్రామానికి చెందిన నలుగురు వేటగాళ్లు తుపాకులతో దుప్పిని వేటాడి దా ని మాంసాన్ని మరో వ్యక్తి (వణ్య ప్రాణుల మాంసం బ్రోకర్) ద్వారా అహోబిలం, బాచేపల్లి, ఆలమూరు గ్రామాల్లో విక్రయించినట్లు సమాచారం. ఈ విషయం అటవీ అధికారుల దృష్టికి రావడంతో ఇద్దరు వేటగాళ్లను అదుపులోకి తీసుకుని విచారించగా విషయం అంతా చెప్పినట్లు తెలుస్తోంది. ఆ నలుగురు వేటగాళ్లు ఎవరు ? మాంసం విక్రయించిన బ్రోకర్ ఎవరు అన్న ది కూడా అధికారులకు తెలిసినప్పటికీ గుర్తు తెలియని వ్యక్తులుగా చెప్పడంతో పాటు అడవిలో కనిపించినందుకే అరెస్ట్ చేశామని చెప్పడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పట్టబడిన ఇద్దరిలో ఒకరిని మాత్రమే అరెస్ట్ చూపించడం, ఒక తుపాకీ మాత్రమే దొరికింది. మిగతా ముగ్గురు అనుమానితుల కోసం గాలిస్తున్నామని అధికారులు ప్రకటించడంపై పలు వ్యవక్తమవుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లతోనే అధికారు లు కేసును నీరుగార్చుతున్నారనే విమర్శలు ఉన్నాయి.
ఒకరు అరెస్ట్, నాటు తుపాకీ స్వాధీనం
నిందితులను తప్పించేందుకు యత్నం