
శ్రావణ ఉత్సవం.. భక్తిపారవశ్యం
శ్రావణమాస ఉత్సవాల్లో భాగంగా మొదటి సోమవారం ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటలకు సుప్రభాతసేవ, మహా మంగళహారతి, ఆకుపూజ, బిందుసేవ, పంచామృతాభిషేకం తదితర పూజల అనంతరం భక్తులను స్వామి దర్శనానికి వదిలారు. ఇంటి దేవుడిని దర్శించుకునేందుకు మన రాష్ట్రం నుంచేకాక తెలంగాణ, కర్ణాటక సూదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ పరిసరాల్లో ప్రత్యేక వంటకాలను వండి స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. భక్తుల సౌకర్యార్థం అతిశీఘ్ర, ప్రత్యేక, శీఘ్ర దర్శనం ఏర్పాట్లు చేశారు. ఫుట్‌వేర్‌బ్రిడ్జీల ఏర్పాటుతో ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూలైన్లలో వచ్చి స్వామిని భక్తులు దర్శించుకున్నారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని డిప్యూటీ కమిషనర్ విజయరాజు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం కౌతాళం సీఐ అశోక్‌కుమార్ గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. – కౌతాళం