
ఉల్లినారు అ‘ధర’హో
ప్యాలకుర్తి వద్ద బోరు కింద ఉల్లి నారుమడి
తుఫాన్ ప్రభావంతో మోస్తరుగా వర్షాలు కురుస్తుండటంతో ఉల్లినారుకు డిమాండ్ పెరిగింది. నాలుగైదు రోజుల కిందటి వరకు ఒక్కో బెడ్డు ఉల్లి నారు రూ.1500 నుంచి రూ.2000 వరకు పలికింది. ప్రస్తుతం ఒక్కో బెడ్డు ఉల్లినారును రూ.2500 నుంచి రూ.3000 వరకు అమ్ముతున్నారు. ఒక ఎకరా ఉల్లి నాటాలంటే సుమారు 6 నుంచి 7 బెడ్ల ఉల్లినారు అవసరమవుతుంది. కోడుమూరు, గూడూరు మండలాల్లో రైతులు వర్షాధారం కింద ఉల్లినాట్లు వేస్తున్నారు. కోడుమూరు, వెంకటగిరి గ్రామాల్లో 1,500పైగా ఎకరాల్లో ఉల్లినాట్లు సాగుతున్నాయి. – కోడుమూరు రూరల్