‘అమ్యామ్యాల’ అనుబంధం! | - | Sakshi
Sakshi News home page

‘అమ్యామ్యాల’ అనుబంధం!

Jul 28 2025 7:49 AM | Updated on Jul 28 2025 7:49 AM

‘అమ్యామ్యాల’ అనుబంధం!

‘అమ్యామ్యాల’ అనుబంధం!

ఎన్‌సీటీఈ పీఏఆర్‌ నోటీస్‌ల ఇచ్చిన కళాశాలలు

13

అఫ్లియేషన్‌కు ఫీజు కట్టిన

కళాశాలలు

43

విత్‌ డ్రా

(రద్దు చేసిన) చేసిన కళాశాలలు

8

కర్నూలు కల్చరల్‌: రాయలసీమ యూనివర్సిటీ అనుబంధ గుర్తింపునకు కొన్ని బీఈడీ కళాశాలల యాజమాన్యాలు అమ్యామ్యాలు ఇచ్చి అఫ్లియేషన్‌ ఫీజులు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో అఫ్లియేషన్‌ కమిటీలు, వర్సిటీ అధికారులు అందరూ ఒకటై కళాశాలల యాజమాన్యాల లాబీంగ్‌కు, అమ్యామ్యాలకు తలొగ్గి బీఈడీ కళాశాలలను తూతూ మంత్రంగా సందర్శించి మమ అనిపించేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం వర్సిటీ అధికారులు బీఈడీ కళాశాలలను సందర్శించేందుకు అఫ్లియేషన్‌ కమిటీలను నియమించారు. ఈ కమిటీ సభ్యులు ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు కళాశాలలను సందర్శించనున్నారు. నిబంధనల మేరకు కళాశాలల నిర్వహణ ఉందా లేదా అని పరిశీలించి నివేదిక సమర్పిస్తారు. దీని ఆధారంగానే వర్సిటీ కళాశాలలకు అఫ్లియేషన్‌ ఇస్తుంది. అయితే వర్సిటీ పాలనను గాడిలో పెట్టి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని చెప్పుకుంటున్న ఆర్‌యూ ఉన్నతాధికారులు మరి నిబంధనల మేరకు అన్ని వసతులు ఉన్న కళాశాలలకు అఫ్లియేషన్‌ ఇస్తారో లేదో తేలనుంది. బీఈడీ కళాశాలలు ఎన్‌సీటీఈ అనుమతి కోసం పొందు పరిచిన అడ్రస్‌లో కాకుండా మరో చోట కళాశాలలను చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిని అఫ్లియేషన్‌ కమిటీలు చూసీచూడనట్లు వ్యవహరిస్తారా గుర్తిస్తారో చూడాలి.

అనుమానాలు..

క్లియరెన్స్‌ పట్టించుకోకుండా వర్సిటీ అధికారులు అన్ని కళాశాలలకు (సుమారు 43) అఫ్లియేషన్‌ ఫీజు కట్టించుకున్నారు. అయితే ఎన్‌సీటీఈ కొన్ని కళాశాలలకు ఫర్ఫామెన్స్‌ అప్రైజల్‌ రిపోర్ట్‌ (పీఏఆర్‌) నోటీస్‌లు ఇవ్వడం, నోటీస్‌ల వివరణకు సంతృప్తి చెందక ఎన్‌సీటీఈ నుంచి విత్‌ డ్రా (కళాశాలల రద్దు) చేసింది. మరి వర్సిటీ అధికారులకు ఈ విషయాలు తెలుసో తెలియదో కానీ అన్ని కళాశాలలకు మాత్రం అఫ్లియేషన్‌ ఫీజు కట్టించుకున్నారు. మరి అఫ్లియేషన్‌ కమిటీలు అఫ్లియేషన్‌ ఫీజు చెల్లించిన అన్ని కళాశాలలను సందర్శిస్తారా లేదంటే ఎన్‌సీటీఈ క్లియరెన్స్‌ ఉన్న వాటినే సందర్శిస్తారా అనేది వేచి చూడాల్సిందే!

ఇదీ వాస్తవం..

● మనుగడలో ఉన్న 13 బీఈడీ కళాశాలలకు ఎన్‌సీటీఈ పర్ఫామెన్స్‌ అప్రైజల్‌ రిపోర్ట్‌ (పీఏఆర్‌) నోటీస్‌లు ఇచ్చింది. అయితే ఎన్‌సీటీ క్లియరెన్స్‌ లేకున్నా ఆర్‌యూ అధికారులు అఫ్లియేషన్‌ ఫీజులు కట్టించుకున్నారు.

● ఎన్‌సీటీఈ 460, 461 ఈసీ మీటింగ్‌లలో ఆర్‌యూ పరిధిలో మనుగడలో ఉన్న 8 కళాశాలలకు పీఏఆర్‌ నోటీస్‌లకు ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందక 2025 విద్యా సంవత్సరానికి గాను వాటిని విత్‌డ్రా (రద్దు) చేయడం చేసింది. రద్దు చేయబడిన కళాశాలలకు ఎన్‌సీటీఈ అనుమతి లేకుండానే వర్సిటీ అధికారులు అఫ్లియేషన్‌ ఫీజులు కట్టించుకున్నారు.

అఫ్లియేషన్‌ కమిటీలు పరిశీలించాల్సినవి ..

● ఎన్‌సీటీఈ కొన్ని కళాశాలలకు ఇన్‌టేక్‌ 50 సీట్లకే అనుమతి ఇస్తే వారేమో 100 సీట్లు ఉన్నట్లు చెప్పుకొని అడ్మిషన్లు చేసుకుంటున్నారు.

● కళాశాల పేరు మీద 50 సీట్లు ఉంటే రూ. 6 లక్షలు, 100 సీట్లు ఉంటే రూ.12 లక్షలు బ్యాంక్‌లలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉండాలి. ఫిక్స్‌డ్‌డిపాజిట్ల ఒరిజినల్‌ బాండ్లు ఉన్నాయో లేదో చూడాలి. కొన్ని యాజమాన్యాలు జిరాక్స్‌ కాపీలను మాత్రమే చూపుతున్నారు. ఫిక్స్‌ డ్‌ డిపాజిట్లు ఉండవు. ఒకవేళ ఉన్నా ఎన్‌ఓసీ తీసుకొని లోన్‌ తీసుకుంటున్నారు. బ్యాంక్‌లో చెక్‌ చేయాలి.

● బిల్డింగ్‌, లీజ్‌ బిల్డింగ్‌ అయితే లీజ్‌ అగ్రిమెంట్‌ లైవ్‌లో ఉందా లేదా (కొన్ని కళాశాలల బిల్డింగ్స్‌ లీజ్‌ పూర్తి అయినట్లు సమాచారం), స్టాఫ్‌ జీతాలు ఆన్‌లైన్‌ బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌, ల్యాబ్‌, లైబ్రరీ ఉన్నాయా లేదా చూడాల్సి ఉంది. కొన్ని కళాశాలలు మల్టీ పర్పస్‌ బిల్డింగ్స్‌లో ఉన్నాయి.

● గతంలో బిల్డింగ్‌ ట్యాక్స్‌, శానిటరీ, బిల్డింగ్‌ స్ట్రక్షరల్‌ అండ్‌ సౌండ్‌ ,ఫైర్‌ సర్టిఫికెట్లు పరిశీలించారు. ఇందులో ఫైర్‌, శానిటరీ సర్టిఫికెట్లు ఫోర్జరీ సర్టిఫికెట్లు పెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

● ప్రతి సంవత్సరం అఫ్లియేషన్‌ కమిటీలో కళాశాలలో ఉన్న డిపీసెన్సీ లిస్ట్‌ ఇస్తారు. వచ్చే సంవత్సరానికి వాటిని ఫుల్‌ ఫిల్‌ చేయాలి. కానీ చాలా కళాశాలల వాటిని పట్టించుకోవు.

● కొన్ని కళాశాలల వారు బిల్డింగ్స్‌ లేకుండానే కేవలం అడ్మిషన్లు చేసుకొని నడుపుతున్నట్లు ఆరోపణలున్నాయి. భవనాలు లేకపోయినా కోర్టు ఆర్డర్‌ తెచ్చుకొని కొనసాగిస్తున్నారు. కోర్టుకు వెళ్లాలనే ఉచిత సలహాను వర్సిటీలోని అధికారులే ఇస్తారనే ప్రచారం ఉంది.

● ప్రతి కళాశాలకు జియోట్యాగింగ్‌ ఉండాలి. చాలా కళాశాలలకు ఈ వ్యవస్థ లేదు.

42 కళాశాలలకు

అఫ్లియేషన్‌ ఫీజు కట్టారు

ఆర్‌యూ అఫ్లియేషన్‌కు 42 కళాశాలలకు అఫ్లియేషన్‌ ఫీజు కట్టారు. ఎన్‌సీటీఈ నుంచి పీఏఆర్‌ నోటీస్‌, విత్‌ డ్రా లిస్ట్‌ మాకు వచ్చింది. ఒక వేళ అఫ్లియేషన్‌ ఫీజు కట్టినా ఎన్‌సీటీఈ పీఏఆర్‌ నోటీస్‌, విత్‌ డ్రా ఉన్న కళాశాలలకు అఫ్లియేషన్‌ కమిటీలు విజిట్‌ చేయవు.

– డాక్టర్‌ బి.విజయ్‌ కుమార్‌ నాయుడు,

రిజిస్ట్రార్‌, ఆర్‌యూ

ఆర్‌యూ పరిధిలో ఉన్న బీఈడీ

కళాశాలలు

43

బీఈడీ కళాశాలల అఫ్లియేషన్‌కు

ఎన్‌సీటీఈ నిబంధనలు నిలిచేనా?

కొన్ని బీఈడీ కళాశాలలకు

పీఏఆర్‌ నోటీస్‌ ఇచ్చిన ఎన్‌సీటీఈ

మరి కొన్ని కళాశాలలను

విత్‌డ్రా చేసిన ఎన్‌సీటీఈ

ఇవేమీ పట్టించుకోకుండా

అఫ్లియేషన్‌ ఫీజు కట్టించుకున్న

ఆర్‌యూ అధికారులు

నేటి నుంచి బీఈడీ కళాశాలలను

సందర్శించనున్న అఫ్లియేషన్‌ కమిటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement