
ఉప ప్రధానార్చకుడి ఆత్మహత్యపై విచారణ
కౌతాళం: జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఉరుకుంద ఈరన్నస్వామి ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పూజన్నస్వామి ఆత్మహత్యపై ఆదివారం రాత్రి శ్రీశైలం ఈఓ శ్రీనివాసులు విచారణ చేపట్టారు. ముందుగా ఆయన పూజన్న ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పూజన్న ఆత్మహత్యపై ఏమైనా అనుమానాలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం దేవాలయ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ విజయరాజును, ప్రధాన అర్చకుడు ఈరప్పస్వామిని, ఉప ప్రధాన అర్చకుడు మహదేవస్వామిలతో పాటు అర్చకులందరినీ పిలిచి విచారణ చేపట్టారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారం మేరకు బీపీ, షూగర్ ఉండడంతో సమాయానికి మందులు తీసుకోక పోవడంతో పూజన్నస్వామి మృతి చెందారన్నారు. దేవాలయంలో పని చేస్తున్న ప్రతి అధికారి ఇచ్చిన సమాచారాన్ని నివేదిక రూపంలో రాష్ట్ర కమిషనర్‌కు పంపిస్తామన్నారు. దేవాలయంలో అర్చకులు వర్గాలుగా విడిపోయారా, పూజల్లో ఏమైనా మార్పులు జరిగాయా, డిప్యూటీ కమిషనర్ ఏమైనా ఇబ్బందులకు గురి చేశాడా అన్న విషయాలపై కూడా విచారణ చేపట్టామన్నారు.
డిపార్టుమెంటల్ పరీక్షలు ప్రారంభం
కర్నూలు(సెంట్రల్): ఉద్యోగుల పదోన్నతుల నిమిత్తం నిర్వహించే డిపార్టుమెంటల్ పరీక్షలు ఆదివారం కర్నూలులోని ఆయాన్ డిటల్ కేంద్రంలో ప్రారంభం అయ్యాయి. షిఫ్టు–1లో 296 మందికిగాను 249 హాజరవ్వగా 47 మంది గైర్హాజరయ్యారు. షిఫ్టు–2లో 221మందికిగాను 187 హాజరవ్వగా 34 మంది పరీక్షలు రాయలేకపోయారు. పరీక్ష కేంద్రాన్ని డిపార్టుమెంటల్ పరీక్షల సమన్వయాధికారి, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ పరిశీలించారు.
యువతికి వజ్రం లభ్యం
తుగ్గలి: టమాట పొలంలో కలుపు తీస్తుండగా ఆదివారం మండలంలోని దిగువచింతలకొండకు చెందిన ఓ యువతికి వజ్రం లభ్యమైనట్లు సమాచారం. వజ్రాల వ్యాపారులు వజ్రం కొనుగోలుకు బేరం సాగిస్తుతున్నట్లు తెలిసింది.
శ్రీగిరిలో భక్తుల సందడి
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం తోలి ఆదివారాన్ని పురస్కరించుకుని స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచి పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామివారి దర్శనానికి క్యూలైన్ వద్దకు చేరుకున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగాణం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులన్నీ కిటకిటలాడాయి.
ప్రభుత్వ హామీల కమిటీ
చైర్మన్‌గా ఇసాక్‌బాషా
నంద్యాల: ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ ఇసాక్‌బాషాను నియమిస్తున్నట్లు ఏపీ శాసన వ్యవస్థ జనరల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ ఆదివారం ప్రకటించారు. స్పీకర్, శాసన మండలి చైర్మన్లు 2025–26 సంవత్సరానికి శాసన సభ, శాసన మండలి సంయుక్త కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్‌గా ఇసాక్‌బాషాను నియమించారు.

ఉప ప్రధానార్చకుడి ఆత్మహత్యపై విచారణ

ఉప ప్రధానార్చకుడి ఆత్మహత్యపై విచారణ

ఉప ప్రధానార్చకుడి ఆత్మహత్యపై విచారణ