
యూరియా కొరత
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో ఎక్కడా యూరియా కనిపించని పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతు భరోసా కేంద్రాలకు 2023–24 వరకు యూరియాతో సహా రసాయన ఎరువులు ఇచ్చేవారు. ఆర్‌బీకేలను గ్రామ వ్యవసాయ సహాయకులు, గ్రామ ఉద్యాన సహాయకులు నిర్వహిస్తుండటంతో ఎరువుల పంపిణీ సాఫీగా సాగేంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆర్‌బీకే పేరును మార్చి కుదించింది. ఉమ్మడి జిల్లాలో 877 ఆర్‌బీకేలు ఉండగా 188 మూతపడి 689 మాత్రమే ఉన్నాయి. వీటికి యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు ఇవ్వకుండా పీఏసీఎస్‌లు, డీసీఎంఎస్‌లకు సరఫరాల చేస్తున్నారు. పీఏసీసీఎస్‌లు, డీసీఎంఎస్‌లు ‘కూటమి’ పార్టీల నేతల చేతుల్లో ఉండటంతో వీటికి సరఫరా అవుతున్న యూరియా పలుకుబడి ఉన్న వారికే వెళ్లిపోతోంది. రైతులకు అందడం లేదు.
రసాయన ఎరువుల్లో రాజీయం
మార్క్‌ఫెడ్ నుంచి పీఏసీఎస్‌లు, డీసీఎంఎస్‌లకే రసాయన ఎరువులు ఎక్కువ ఇస్తుండమే పెద్ద సమస్యగా మారిందని ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఏడీఏ, ఏవోలు చెబుతున్నారు. ఇవి రాజకీయ నేతల చేతుల్లో ఉండటంతో యూరియా కొంతమందికి మాత్రమే అందుతోంది. సమాన్య, మధ్య తరగతి రైతులకు లభించని పరిస్థితి ఏర్పడిందని అధికారులే పేర్కొంటున్నారు. ఆర్‌బీకేలకు అంతంతమాత్రం కేటాయించిన యూరియా కూడా టీడీపీ నేతలకే వెళ్లిపోతోంది.
ఇదీ వాస్తవం
మార్క్‌ఫెడ్‌లో 268 టన్నులు, రైతు సేవా కేంద్రాల్లో 185 టన్నులు, రీటైల్ డీలర్ల దగ్గర 693 టన్నులు, హోల్‌సేల్ డీలర్ల దగ్గర 2.5 టన్నులు, సహకార సంఘాలు, డీసీఎంఎస్ దగ్గర 10.12 టన్నుల యూరియా ఉన్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. ప్రయివేటు డీలర్ల దగ్గర 693 టన్నుల యూరియా ఉందని చెబుతున్నారు. అయితే ఏ డీలరు కూడా తమ దగ్గర యూరియా ఉందని విక్రయిస్తున్న దాఖలాలు లేవు. ఆదివారం వందలాది మంది రైతులు డీలర్ల దగ్గరికి వెళ్లి యూరియా అడగగా.. స్టాక్ లేదని వెనక్కు పంపారు. యూరియా సమస్య వ్యవసాయ శాఖకు చెందిన ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు డివిజన్‌లలో ఎక్కువగా ఉంది. ఆర్‌బీకేలకు వెళ్లిన యూరియా గుట్టుచప్పడు కాకుండా ప్రయివేటు డీలర్ల వద్దకు చేరుతున్నట్లు సమాచారం. డీలర్లు బ్లాక్‌లో విక్రయిస్తూరనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఒక్క బస్తా కూడా లభించని వైనం
ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు
డివిజన్‌లలో సమస్య తీవ్రం