
గాయపడినా గప్‌చుప్!
కర్నూలుకు కూత వేటు దూరంలో ఉన్న బీసీ బాలుర వసతి గృహంలో ఈ నెల 23వ తేదిన రాత్రి చరణ్‌తేజ (8వ తరగతి) అనే విద్యార్థికి ఫ్యాన్ రెక్క తగిలి తలకు గాయమైంది. వెంటనే హాస్టల్‌లో పనిచేస్తున్న వర్కరు వసతి గృహ సంక్షేమాధికారికి సమాచారం అందించి ఆమె సూచన మేరకు విద్యార్థి చరణ్‌తేజను కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్సను చేయించారు. ఫ్యాన్ రెక్క తగలడంతో విద్యార్థి తలకు నాలుగు కుట్లు పడ్డాయి. అయితే విద్యార్థి తలకు తగిలిన గాయం గురించి సంబంధిత అధికారులు ఎవరు వాకబు చేయకపోవడం గమనార్హం. ఇలాంటి సంఘటనలు జిల్లాలోని పలు వసతి గృహాల్లో జరుగుతున్నా, ఎక్కడికక్కడ గప్‌చుప్‌గా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.