
కొండ ముచ్చుల దాడి
ప్యాపిలి: జలదుర్గం గ్రామంలో శనివారం కొండముచ్చులు గ్రామస్తులపై దాడి చేశాయి. గత కొద్ది రోజులుగా ఇతర ప్రాంతాల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు గ్రామంలో కొండముచ్చులను వదిలివెళ్లారు. అప్పటి నుంచి గ్రామంలో కొండముచ్చులు స్వైరవిహారం చేస్తూ బెంబేలెత్తిస్తున్నాయి. శనివారం గ్రామానికి చెందిన రంగనాయకులు, మల్లేశ్వరయ్య, ఓబులేసు, కంబయ్య, బాషా తదితరులపై దాడి చేసి గాయపర్చాయి. గాయపడిన వారిని స్థానిక పీహెచ్‌సీలో చికిత్స అందించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి కొండముచ్చులను బంధించి అటవీ ప్రాంతానికి తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు.