
గుంటికంటి రంగస్వామికి జలాభిషేకం
ఎమ్మిగనూరు పురపాలక సంఘ పరిధిలోని వెంకటాపురంలో స్వయంభూగా వెలసిన గుంటి రంగస్వామికి జలాభిషేకం చేశారు. ఏటా శ్రావణ మాసంలో గుంటి రంగస్వామికి తుంగా జలాలతో అభిషేక ం చేయడం ఆనవాయతీగా వస్తోంది. ఈ మేరకు శ్రావణమాసం మొదటి శనివారం వెయ్యి మందికిపైగా 25 కిలో మీటర్ల దూరంలోని తుంగభద్ర నదికి పాదయాత్రగా వెళ్లారు. అక్కడ పూజలు చేసి తుంగా జలాలతో గోవింద నామస్మరణ చేసుకుంటూ గ్రామానికి చేరుకున్నారు. ఈ సమయంలో గ్రామంలో ఆలయం వరకు నేలపై పడుకున్న మహిళా భక్తులపై నుంచి తుంగా జలాలు తీసుకొచ్చిన వారు మంగళవాయిద్యాలతో నడుచుకుంటూ వెళ్లారు. అనంతరం ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వయంభూ విగ్రహ రూపంలో ఉన్న స్వామివారికి ప్రత్యేక పూజతో జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేపట్టారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ బజారి, గ్రామ పెద్దలు నీలకంఠారెడ్డి, మేసీ్త్ర నాగన్న, పాండురంగ, ఈరన్న, ఆనంద్‌తో పాటు పెద్దలు పాల్గొన్నారు. – ఎమ్మిగనూరు

గుంటికంటి రంగస్వామికి జలాభిషేకం

గుంటికంటి రంగస్వామికి జలాభిషేకం