
గులాబీ రంగు పురుగు ఉద్ధృతిని నివారించాలి
నంద్యాల(అర్బన్): పత్తి పంటను ఆశించిన గులాబీరంగు పురుగు ఉద్ధృతిని నివారించాలని ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ జాన్సన్ తెలిపారు. ఎకరాకు నాలుగు లింగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేయడమే కాకుండా క్లోరిపైరీపాస్ 2.5 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. స్థానిక కార్యాలయంలో శనివారం శిక్షణ, సందర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖరీఫ్‌లో పంటల సాగు, ప్రస్తుతం రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులతో చర్చించారు. అనంతరం ఏడీఆర్ జాన్సన్ మాట్లాడుతూ.. ప్రస్తు తం కురుస్తున్న వర్షాలు పంటలు తీవ్రంగా నష్టపరిచే అవకాశం ఉందని, పొలాల్లో నీరు లేకుండా సాఫీగా వెళ్లేలా చూడాలన్నారు. కార్యక్రమంలో శాస్త్ర వేత్తలు డాక్టర్ అశోక్‌కుమార్, శివరామకృష్ణ, వెంకటరమణ, డీడీఏ మద్దిలేటి, కర్నూలు ఏడీఏ రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.