
చాతుర్మాస దీక్షలో పీఠాధిపతి
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు 13వ చాతుర్మాస దీక్ష స్వీకరించారు. మంగళవారం ఉదయం పూజామందిరంలో వేద మంత్రోచ్ఛారణలు, విశిష్ట పూజోత్సవాలు మధ్య దీక్ష చేపట్టారు. ముందుగా రాఘవేంద్రుల మూల బృందావనంతో దీక్ష పదార్థాలకు పూజలు గావించారు. రాములోరి సంస్థాన పూజ చేపట్టి శాస్త్రోక్తంగా దీక్షబూనారు. మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ ఎస్.కె.శ్రీనివాసరావు, వెంకటేష్ జోషి, సురేష్ కోన్నాపూర్ దీక్ష క్రతువులో పాల్గొన్నారు. అనంతరం దీక్ష ప్రశస్థిపై పీఠాధిపతి ప్రవచించారు. 49 రోజుల పాటు స్వామిజీ దీక్షలో కొనసాగనున్నారు. ఆనవాయితీలో భాగంగా దీక్ష సమయంలో నియమావళి ప్రకారం ఆహారం, ఫలాలు, కూరగాయలు స్వీకరిస్తారు.
నేడు ‘డయల్ యువర్ విద్యుత్ ఎస్‌ఈ’
● ఫోన్ చేయవలసిన నెంబర్
73826 14308
కర్నూలు(అగ్రికల్చర్): ‘డయల్ యువర్ విద్యు త్ ఎస్‌ఈ’ కార్యక్రమాన్ని ఈ నెల 23న నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఈ ఎం.ఉమాపతి తెలిపారు. బుధవారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు విద్యుత్ భవన్‌లో ఈ కార్యక్రమం నిర్వ హిస్తామని మంగళవారం ఒక ప్రకటన విడు దల చేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయా లు, లో వోల్టేజీ, విద్యుత్ సిబ్బంది పనితీరు, ఇతరత్రా విద్యుత్ సమస్యలపై డయల్ యువ ర్ ఎస్‌ఈకి వినియోగదారులు 73826 14308 నెంబర్‌కు ఫోన్ చేయవచ్చని సూచించారు.
విద్యార్థులకు కంటి పరీక్షలు
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లోని విద్యార్థులకు కంటి పరీక్షలు ప్రారంభించినట్లు జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్ సంధ్యారెడ్డి చెప్పారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 21 నుంచి అక్టోబర్ 31వ తేది వరకు విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. 6 నుంచి 18 సంవత్సరాల్లోపు వయస్సు విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించి, దృష్టిలోపం ఉంటే ఉచితంగా చికిత్సలు, కంటి అద్దాలు పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో భాగంగా సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో పనిచేస్తున్న పారామెడికల్ ఆఫ్తాల్మిక్ ఆఫీసర్లు పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తారన్నారు.
ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించండి
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి పి.రామంజనేయులు కంపెనీల ప్రతినిధులకు సూచించారు. 2025–26లో 550 హెక్టార్లలో ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించాలనేది లక్ష్యమని, ఇప్పటి వరకు 86 హెక్టార్లలో ప్లాంటేషన్ పూర్తయిందన్నారు. కలెక్టరేట్‌లోని జిల్లా ఉద్యాన శాఖ కార్యాలయంలో మంగళవారం ఆయన ఆయిల్‌పామ్ కంపెనీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 13 మండలాల్లో ఆయిల్‌పామ్ సాగుకు అవకాశం ఉందని, సెప్టెంబర్ 15 వరకు మెగా ప్లాంటేషన్ డ్రైవ్ కొనసాగుతుందని, ఆలోపు కనీస లక్ష్యంలో 50 శాతం ప్లాంటేషన్ పూర్తి కావాలన్నారు. నీటి వసతి కలిగిన రైతులకు అవగాహన కల్పించాలన్నారు. హెక్టారుకు ప్లాంటేషన్‌కు రూ.29 వేలు, నిర్వహణకు రూ.5250, అంతరపంటల సాగుకు రూ.5250 సబ్సిడీ వస్తుందన్నారు. సమావేశంలో సాంకేతిక ఉద్యాన అధికారి అనూష తదితరులు పాల్గొన్నారు.

చాతుర్మాస దీక్షలో పీఠాధిపతి

చాతుర్మాస దీక్షలో పీఠాధిపతి