‘పచ్చ’నోట్ల సానుభూతి! | - | Sakshi
Sakshi News home page

‘పచ్చ’నోట్ల సానుభూతి!

Apr 3 2024 2:00 AM | Updated on Apr 3 2024 7:47 AM

- - Sakshi

ఓదార్పు ముసుగులో డబ్బు పంపిణీ

కోడ్‌ ఉల్లంఘించిన టీడీపీ నేతలు

కల్లూరు/గూడూరు రూరల్‌: ఎన్నికల వేళ టీడీపీ నేతలు యథేచ్ఛగా కోడ్‌ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. చీరలు పంపిణీ చేస్తున్నారు.. నిర్ణీత సమయానికి మించి ప్రచారం కొనసాగిస్తున్నారు.. తాజాగా గడ్డివాములు దగ్ఢం కాగా, డబ్బు ముట్టజెప్పి కోడ్‌కు విరుద్ధంగా వ్యవహరించారు. వివరాల్లోకి వెళితే.. కె.నాగలాపురం పోలీసుస్టేషన్‌ పరిధిలోని పర్లలో మంగళవారం ఐదు గడ్డివాములు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన మంగలి నాగసుంకన్న, అశోక్‌కుమార్‌రెడ్డి, కుర్వ అయ్యన్న, కుర్వ సోమన్నకు చెందిన నాలుగు గడ్డివాములు ప్రమాదవశాత్తూ అంటుకున్నాయి.

స్థానికులు ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే ఆలోపే గడ్డివాములు పూర్తిగా దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న నంద్యాల పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి బాబాయి బైరెడ్డి విష్ణువర్దన్‌రెడ్డి బాధితులను ఓదార్చే ముసుగులో గ్రామానికి చేరుకున్నారు. కోడ్‌ అమలులో ఉండగా ఎలాంటి డబ్బు పంపిణీ చేపట్టరాదనే విషయాన్ని పక్కనపెట్టి ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున పంపిణీ చేశారు. అదేవిధంగా టీడీపీ పాణ్యం అభ్యర్థి గౌరు చరితారెడ్డి భర్త గౌరు వెంకటరెడ్డి కూడా బాధితులకు ఒక్కొక్కరికి రూ.5వేలు చొప్పున అందించారు. ఎన్నికల వేళ రాజకీయ పార్టీల నేతలు ఓటర్లకు డబ్బు పంపిణీ చేయడం కోడ్‌ ఉల్లంఘన కిందకు వస్తుంది. అందుకు విరుద్ధంగా టీడీపీ నేతలు వ్యవహరించడం గమనార్హం.

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement