
టీడీపీ హయాంలో ఆరోగ్య శ్రీకార్డు కోసం మేం అనేక సార్లు ప్రయత్నం చేశాం. రాలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక వలంటీర్‌ను ఆరోగ్యశ్రీ కార్డు గురించి అడిగాం. ఆయన ఇంటి వద్దకు వచ్చి వివరాలు తీసుకొని వెళ్లాడు. ఎలాంటి సిఫార్సులు లేకుండా మాకు ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది. ఇంటికి వచ్చి ఇచ్చిపోయారు. రోగం వచ్చినప్పుడు వైద్యం చేయించుకోవాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నది. ఈ కార్డుతో మా కుటుంబానికి మొత్తం కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందుతుంది. చాలా సంతోషం. సచివాలయ వ్యవస్థ వల్లే ఇది సాధ్యమైంది. ప్రభుత్వం పనితీరు బాగుంది.
– మేరి అమృత రాజకుమారి, కర్నూలు, హౌసింగ్‌బోర్డు కాలనీ
సొంతింటి కల నెరవేరింది
నేను, నా భర్త షేక్ మాసుం బాషా కూలి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాం. మాకు గ్రామంలో సొంత ఇల్లు లేదు. మాకు నలుగురు పిల్లలు . ముగ్గురికి వివాహం అయ్యింది. మేం కొన్నేళ్లుగా బాడుగ ఇంట్లో ఉండేవాళ్లం. ఇంటి బాడుగ చెల్లించడానికి, కుటుంబ పోషణకు చాలా ఇబ్బందులు పడేవాళ్లం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక మా గ్రామంలో జగనన్న కాలనీ ఏర్పాటు చేశారు. మాలాంటి పేదలకు సెంటున్నర స్థలం ఇచ్చారు. ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం రూ.1.50లక్షల ఆర్థిక సాయం చేసింది. నిర్మాణం పూర్తి చేసుకుని కొన్ని నెలలుగా సొంత ఇంట్లో కుటుంబ సభ్యులందరం ఆనందంగా గడపుతున్నాం.
– షేక్ నూర్‌జాహన్ బీ, బస్తిపాడు గ్రామం, కల్లూరు

