పెళ్లి రోజు జరుపుకోకుండానే.. | - | Sakshi
Sakshi News home page

పెళ్లి రోజు జరుపుకోకుండానే..

Jun 19 2023 1:48 AM | Updated on Jun 19 2023 11:19 AM

- - Sakshi

కర్నూలు: తెల్లవారితే పెళ్లి రోజు వేడుకలు జరుపుకోవాల్సిన ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పగిడ్యాలకు చెందిన గొల్ల పుల్లన్న కూతురు చంద్రకళ(23)కు ఏడాది క్రితం అల్లూరు గ్రామానికి చెందిన పాయల కృష్ణంరాజుతో వివాహమైంది. వారం రోజుల క్రితం పుట్టింటికి చేరుకుంది. భర్త కృష్ణంరాజు కూడా ఆదివారం ఉదయం వరకు ఇక్కడే ఉండి ఆ తర్వాత అల్లూరుకు వెళ్లాడు.

తల్లిదండ్రులు కూడా పని మీద బయటకు వెళ్లారు. కొద్ది సేపటి తర్వాత ఇంటికొచ్చిన తల్లిదండ్రులకు కుమార్తె చంద్రకళ ఫ్యాన్‌కు ఉరేసుకుని విగతజీవిగా కనిపించింది. సోమవారం పెళ్లి రోజు వేడుక చేసుకోవాల్సిన కుమార్తె మృతి చెంది కనిపించడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కడపునొప్పి బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతు రాలి తల్లి వరలక్ష్మీ చెబుతోంది.

సమాచారం మేరకు తహసీల్దార్‌ భారతి ఘటన స్థలానికి చేరి పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ముచ్చుమర్రి ఎస్‌ఐ నాగార్జున తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement