ద్వీపం! | - | Sakshi
Sakshi News home page

ద్వీపం!

May 20 2026 10:25 AM | Updated on May 20 2026 10:25 AM

బుధవారం శ్రీ 20 శ్రీ మే శ్రీ 2026 కళావిహీనంగా ప్రకృతి వరప్రదాయిని నిత్యాన్నదానానికి విరాళం భక్తుల కోలాహలం గురుధాంలో విజయేంద్ర సరస్వతీ

న్యూస్‌రీల్‌

2024 వరదలకు దెబ్బతిన్న భవానీ ద్వీపం ఇప్పటికీ పునరుద్ధరించని చంద్రబాబు సర్కారు పచ్చదనం కరువు.. కనిపించని యాక్టివిటీస్‌ పర్యాటకులు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోని అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్న పర్యాటకులు

ఆకర్షణలన్నీ కనుమరుగు

యాక్టివిటీస్‌ ఏమీ లేవు..

ఎంతో అందంగా తీర్చిదిద్దవచ్చు

కృష్ణాజిల్లా
బుధవారం శ్రీ 20 శ్రీ మే శ్రీ 2026
కొడిగట్టిన
కళావిహీనంగా ప్రకృతి వరప్రదాయిని

జగ్గయ్యపేట: తిరుమలగిరిలోని వేంకటేశ్వర స్వామి నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన ఆలపాటి సాంబశివరావు దంపతులు రూ. 1,00,116ను విరాళంగా అందించారు.

మోపిదేవి: శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయం భక్తులతో కోలాహలంగా మారింది. మంగళవారం వివిధ సేవా టికెట్ల ద్వారా రూ. 8.08లక్షల ఆదాయం వచ్చింది.

జగ్గయ్యపేట: బలుసుపాడులోని గురుధాం క్షేత్రాన్ని కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ మంగళవారం సందర్శించారు.

సాక్షి ప్రతినిధి, విజయవాడ: అందాలతో కనువిందు చేసే భవానీ ద్వీపం కళా విహీనంగా మారింది. పచ్చదనానికి తోడు, పారిశుద్ధ్యం లోపించింది. పర్యాటకులను ఆకర్షించే యాక్టివిటీస్‌ కరువయ్యాయి. దీంతో ద్వీపాన్ని సందర్శించే పర్యాటకులు నిరుత్సాహంతో వెనుదిరుగుతున్నారు. కొరవడిన ప్రభుత్వ పర్యవేక్షణ తీరుపై మండిపడుతున్నారు.

వరదలకు దెబ్బతిని..

కృష్ణమ్మకు 2024 సెప్టెంబరు నెలలో భారీ ఎత్తున వరద వచ్చింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 11లక్షల క్యూసెక్కులకు పైగా వచ్చిన వరద నీరు రావడంతో భవానీ ద్వీపం తీవ్రంగా దెబ్బతింది. పూర్తిగా దాని స్వరూపమే మారిపోయింది. అప్పటి నుంచి ప్రభుత్వం ద్వీపం అభివృద్ధి గురించి పట్టించుకోకపోవడంతో, అందాల ద్వీపంలో కాంతులు కనుమరుగయ్యాయి. మరోవైపు చంద్రబాబు సర్కారు టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని గొప్పలు చెబుతోంది. లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేస్తున్న ఈవెంట్‌లపై ఉన్న శ్రద్ధను, భవానీ ద్వీపంపై పెట్టకపోగా, దీనిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే విధంగా పావులు కదుపుతోంది. చంద్రబాబు నివాసానికి కూతవేటు దూరంలో ఉండే భవానీ ద్వీపం దుస్థితి చూసి, ద్వీపాన్ని సందర్శించే పర్యాటకులు బాబు మాటలు అన్నీ మాయ మాటలే అని పెదవి విరుస్తున్నారు.

పట్టించుకోని బీఐటీసీ..

ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక సంస్థ (ఏపీటీడీసీలో భాగంగా భవానీ ఐలాండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (బీఐటీసీ)ఆధ్వర్యంలో ద్వీపం ఉంటుంది. వరద వచ్చి వెళ్లి దాదాపు రెండేళ్లు గడుస్తున్నా, ద్వీపం పునరుద్ధరణ గురించి బీఐటీసీ పట్టించుకోలేదు. దీంతో ఇప్పటికే ఇసుక మేటలు వేసి, చెట్లు నేలకొరిగి కళా విహీనంగానే ఉంది. శని, ఆదివారాలు, వేసవి సెలవుల్లో పెద్ద ఎత్తున భవానీ ద్వీపం సందడి ఉండేది. సెలవు రోజుల్లో 70వేల నుంచి 80 వేల మంది భక్తులు దుర్గమ్మను దర్శనం చేసుకొంటారు. దర్శనానికి వచ్చిన విజయవాడలో భక్తులను ఆకర్షించే ఏకై క పర్యాటక ప్రదేశం భవానీ ద్వీపం. ఏపీటీడీసీ ఆధ్వర్వంలో బోట్లు బెరంపార్కు నుంచి బయలుదేరి ద్వీపానికి వెళ్తాయి. శని, ఆదివారాలతో రోజు రెండు నుంచి మూడు వేల మందికి పైగా పర్యాటకులు, కృష్ణమ్మ పరవళ్లు, భవానీ ద్వీపం అందాలు తిలకించేందుకు వెళ్తారు. భవానీ ద్వీపంలో ఎటువంటి యాక్టివిటీస్‌ లేకపోవడంతో పర్యాటకుల సంఖ్య రోజు రోజుకూ గణనీయంగా తగ్గుతోంది. గతంలో సందర్శించిన పర్యాటకులే ప్రస్తుతం భవానీ ద్వీపం దుస్థితి చూసి పెదవి విరుస్తూ, అక్కడ సౌకర్యాలు లేక ఇబ్బంది పడి, రెండు, మూడు గంటల లోపే వెనుతిరిగి వచ్చేస్తున్నారు.

భవానీ ద్వీపంలో మూతబడిన రోబోటిక్‌ జురాసిక్‌ పార్క్‌

7

భవానీ ద్వీపంలో ఆడుకునేందుకు యాక్టి విటీస్‌ ఏమీ లేవు. చూసేందుకు కూడా ఏమీ లేవు. మొత్తం అధ్వానంగా ఉంది. వరద వచ్చి వెళ్లి రెండేళ్లు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఒకప్పుడు ద్వీపంలోకి వెళ్లేందుకు ఉత్సాహ పడేవాళ్లం. ఇప్పుడు చూస్తే మళ్లీ వెళ్లకూడదని అనిపిస్తోంది. ద్వీపంలో ఏమీ లేవని తెలిసి కూడా పర్యాటకులను బురిడీ కొట్టిస్తున్నారు.

– కృష్ణమూర్తి, పర్యాటకుడు

భవాని ద్వీపాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దవచ్చు. ఇందులో వన్యప్రాణుల ఉంచవచ్చు. పెద్ద పిల్లలు, ఆనందంగా గడిపే విధంగా అన్ని హంగులతో తీర్చిదిద్దాలి. ప్రస్తుతం ద్వీపంలో పచ్చదనం కూడా కరువు అవుతోంది. ఎండిన చెట్లు, పేరుకు పోయిన చెత్త దర్శనం ఇస్తోంది.

– కె.జయప్రకాశ్‌రెడ్డి, పర్యాటకుడు

Advertisement
 
Advertisement
Advertisement