అధికారులను అభినందించిన కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గతంలో ఎన్నడూలేని విధంగా అంతర్జాతీయ మ్యూజియం డే వేడుకలను విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైన అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అభినందించారు. మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ లక్ష్మీశను ఆర్కియాలజీ అండ్ మ్యూజియమ్స్ శాఖ కమిషనర్ పి.సరేష్, డెప్యూటీ డైరెక్టర్ రామసుబ్బారెడ్డి, ఏడీలు ఎస్.వెంకటరావు, కె.నరసింహనాయుడు, ఆర్.శివకుమార్, ఇ.భాస్కర్ నాయక్, జి.గంగాధర తదితరులు కలిసి ధన్యవాదాలు తెలియజేశారు.
సికింద్రాబాద్–నహర్లాగన్ మధ్య వేసవి వారాంతపు రైలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో విజయవాడ, గుంటూరు నగరాల మీదుగా సికింద్రాబాద్ – నహర్లాగన్ మధ్య ప్రత్యేక వారాంతపు రైళ్లను నడపనున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్‌ఓ నుస్రత్ మండ్రుప్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ – నహర్లాగన్ (07046) ప్రత్యేక రైలు ఈ నెల 29 నుంచి జూన్ 26 వరకు ప్రతి శుక్రవారం ఉదయం 8.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, ఆదివా రం సాయంత్రం నాలుగు గంటలకు నహర్లాగన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు జూన్ ఒకటి నుంచి 29 వరకు ప్రతి సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు నహర్లాగన్‌లో బయలుదేరి, బుధవారం రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. రెండు మార్గాలలో చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళంరోడ్డు, పలాస, బ్రహ్మపూర్ స్టేషన్‌లలో ఆగుతుంది.


