పెల్లుబికిన ప్రజాగ్రహం | - | Sakshi
Sakshi News home page

పెల్లుబికిన ప్రజాగ్రహం

May 19 2026 1:46 AM | Updated on May 19 2026 1:46 AM

పెల్లుబికిన ప్రజాగ్రహం ● జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఆందోళనలు నిర్వహించారు. పెంచిన పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టర్‌ డి.కె.బాలాజీకి వినతిపత్రం అందించారు. ధరల నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని నేతలు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ షేక్‌ సలార్‌ దాదా, మాజీ ఏఎంసీ చైర్మన్‌ షేక్‌ అచ్చాబా, నాయకులు బొర్రా విఠల్‌, మేకా సుబ్బన్న, రాంప్రసాద్‌, వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. ● గుడివాడ ఆర్డీఓ కార్యాలయం వద్ద వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో పెట్రోలు, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ నేతలు అధిక సంఖ్యలో కార్యాలయానికి చేరుకోవటంతో కార్యాలయం లోనికి ప్రవేశించేందుకు పోలీసులు అడ్డుపడ్డారు. ముఖ్యనేతలు కార్యాలయంలోకి వెళ్లి ఆర్డీఓ జి.బాలసుబ్రహ్మణ్యంనకు వినతిపత్రం అందించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు దగ్గుబాటి శశిభూషణ్‌, పెయ్యల ఆదాము, మట్టా జాన్‌ విక్టర్‌ ఇతర నాయకులు పాల్గొన్నారు. ● వైఎస్సార్‌ సీపీ పిలుపు మేరకు పెడన తహసీల్దార్‌ కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఉప్పాల రాము ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ధరల పెంపును ఉపసంహరించుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇన్‌చార్జి తహసీల్దార్‌ అనిల్‌కుమార్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. గూడూరు ఎంపీపీ సంగా మధుసూదన్‌రావు, కృత్తివెన్ను, గూడూరు జెడ్‌పీటీసీ సభ్యులు రత్నకుమారి, సురేష్‌, రంగబాబు, ఆర్టీసీ రీజనల్‌ మాజీ చైర్మన్‌ పిన్నింటి మహేష్‌, నాయకులు శ్రీనివాసరావు, గొరిపర్తి రవికుమార్‌, ముత్యాల నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. ● పెట్రోలు, డీజిలు ధరల పెంపును నిరసిస్తూ పెనమలూరు నియోజకవర్గంలో ఆందోళన చేపట్టారు. పెనమలూరు మండలం పోరంకి ప్రధాన సెంటరు నుంచి తాడిగడప మునిసిపల్‌ కార్యాలయం వరకూ ర్యాలీ చేపట్టారు. స్థానిక గాంధీ బొమ్మ సెంటరులో పెట్రోలు, డీజిల్‌ ధరల పెంపుపై ఆందోళన నిర్వహించారు. అనంతరం కార్యాలయం అధికారులకు వినతిపత్రం అందించారు. నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో జెడ్‌పీటీసీ సభ్యుడు బాకీ బాబు, పార్టీ రాష్ట్ర నాయకులు ప్రతివాడ రాఘవరావు, నక్కా శ్రీనివాసరావు, కొండవీటి సుబ్బారావు, నాయకులు మాదు శ్రీహరిరాణి, నందిపాటి బిందుమాధవి, షేక్‌ అబుకలాం, పిడికిటి రామకోటేశ్వరరావు, కె.వెంకటేశ్వరరావు, అష్రఫ్‌, మరీదు విజయ్‌కుమార్‌, తోకల ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.

పెట్రోలు, డీజిల్‌ ధరల పెంపుపై వైఎస్సార్‌ సీపీ నిరసన కృష్ణాజిల్లా వ్యాప్తంగా కొనసాగిన ఆందోళనలు ప్రభుత్వ తీరును ఎండగడుతూ ప్రదర్శనలు పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌

పెట్రో ధరల పెంపును నిరసిస్తూ అవనిగడ్డ నియోజకవర్గంలో ఆందోళనలు కొనసాగాయి. పార్టీ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకూ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. పెట్రోలు, డీజిల్‌ ధరల పెంపుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను రమేష్‌బాబు వివరించారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు.

పెట్రోలు, డీజిలు ధరల పెంపుపై వైఎస్సార్‌ సీపీ పిలుపు మేరకు పామర్రు నియోజకవ ర్గంలో వినూత్న నిరసన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్‌ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకూ మోటారు బైక్‌లను నడిపించుకుంటూ వచ్చి నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందించిన అనంతరం కైలే అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను తుంగలో తొక్కుతూ కూటమి విధ్వంసకర పాలన సాగిస్తోందని మండిపడ్డారు. అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే పెట్రోలు, డీజిల్‌ ధరలు మండుతున్నాయని వాపోయారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొడ్డు రమేష్‌, మూల్పూరి హరీష, గవాస్కర్‌రాజు, లంకపల్లి రాంబాబు, ఎంపీపీ దాసరి అశోక్‌కుమార్‌, జెడ్‌పీటీసీ జొన్నల రామమోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

కంకిపాడు: పెట్రోలు, డీజిల్‌ ధరలు పెంపుపై ప్రజాగ్రహం పెల్లుబికింది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పెరిగిన పెట్రోలు, డీజిల్‌ ధరలను తగ్గించాలంటూ వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో ప్రజలు సోమవారం నిరసనలు చేపట్టారు. ప్రజా భాగస్వామ్యంలో అన్ని నియోజకవర్గాల్లో ఆందో ళనలు మిన్నంటాయి. రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ ప్రజలు నిరసనల్లో భాగస్వాములయ్యారు. పెంచిన పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గించాలని ముక్తకంఠంతో నినదించారు. కృష్ణాజిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సోమ వారం శాంతియుతంగా ఆందోళనలు, ర్యాలీలు కొనసాగాయి.

నియోజకవర్గాల వారీగా..

అవనిగడ్డ నియోజకవర్గంలో బైక్‌ ర్యాలీ

పామర్రులో వినూత్న నిరసన

Advertisement
 
Advertisement
Advertisement